నైజాంలో సంక్రాంతి సినిమాల హడావిడి… డిస్ట్రిబ్యూటర్స్ ఎవరంటే..?

నైజాంలో సంక్రాంతి సినిమాల హడావిడి… డిస్ట్రిబ్యూటర్స్ ఎవరంటే..?

by Mounika Singaluri

ఈసారి సంక్రాంతికి తెలుగులో భారీ పోటీ నెలకొంది. దాదాపు ఐదు సినిమాలు వరకు సంక్రాంతి బరిలో ఉన్నాయి. ఇవి కాకుండా తమిళ్ డబ్బింగ్ సినిమాలు మరో రెండు ఉన్నాయి. ఎవరు కూడా వెనక్కి తగ్గేందుకు ససేమిరా అంటున్నారు. అయితే ఇన్ని సినిమాలు ఒకేసారి రిలీజ్ అయితే థియేటర్ల సమస్య వస్తుందని డిస్ట్రిబ్యూటర్లు అంటున్నారు.

Video Advertisement

అయితే ఇప్పటికే సంక్రాంతి సినిమాలను భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు డిస్ట్రిబ్యూటర్లు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు పెద్ద పెద్ద సినిమాలు డిస్ట్రిబ్యూషన్, థియేటర్ల అగ్రిమెంట్లు కూడా జరుగుతున్నాయి. సంక్రాంతికి ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్న సినిమా గుంటూరు కారం. ఈ సినిమాని నైజం లో ప్రముఖ నిర్మాత,టాప్ డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు విడుదల చేయనున్నారు. దీనితోపాటు వెంకటేష్ నటిస్తున్న సైంధవ్ సినిమాను కూడా దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు.

అలాగే తేజ సజ్జా నటిస్తున్న హనుమాన్ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నైజాంలో డిస్ట్రిబ్యూట్ చేయనుంది. ఇక రవితేజ నటిస్తున్న ఈగల్ సినిమాని ఏషియన్ సినిమాస్ వారు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇది కాక పోటీలో ఉన్న నాగార్జున నా స్వామి రంగా సినిమా డిస్ట్రిబ్యూషన్ ఇంకా ఫిక్స్ కాలేదు. దాదాపు ఈ సినిమాని అన్నపూర్ణ బ్యానర్ పైన సొంతంగా డిస్ట్రిబ్యూట్ చేసే అవకాశం ఉంది. థియేటర్లు తక్కువైన పర్లేదు సంక్రాంతికి రావాలని నాగార్జున ఫిక్స్ అయినట్లు టాలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది.


You may also like

Leave a Comment