హిందూ వివాహ చట్టం నియమాలు ఎలా ఉంటాయి..? ఎలాంటి కారణాలకి విడాకులు మంజూరు చేస్తారు..?

హిందూ వివాహ చట్టం నియమాలు ఎలా ఉంటాయి..? ఎలాంటి కారణాలకి విడాకులు మంజూరు చేస్తారు..?

by Mohana Priya

Ads

పెళ్లి అనేది అందరి జీవితంలో ఒక ముఖ్యమైన ఘట్టం అని అంటూ ఉంటారు. ఇలాంటి ఒక విషయం గురించి చాలా మంది ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. దీని వల్ల ఎటువంటి సమస్యలు రాకూడదు అని అనుకుంటారు.

Video Advertisement

అయితే ఎంత చేసినా కూడా తర్వాత కొన్ని సమస్యలు వస్తాయి. దానికి కొంత మంది సర్దుకుపోతారు. కానీ ఆ సమస్యలు మరీ పరిష్కరించలేనివి అయినప్పుడు వారు విడాకులు తీసుకుంటారు. ఈ విడాకులు అనేవి ఆ జంట పరస్పరం ఆలోచించుకొని తీసుకుంటారు.

దీని గురించి ఇప్పటికీ చర్చలు జరుగుతూనే ఉంటాయి. కుటుంబం అన్నాక ఇలాంటి సమస్యలు ఏవో ఒకటి వస్తున్నాయి సర్దుకుపోవాలి అని కొంతమంది అంటూ ఉంటే, మరి కొంతమంది మాత్రం కలిసి బతకలేనప్పుడు విడిపోయి ప్రశాంతంగా బతకడం నయం అని అంటుంటారు. ఇలా ఈ విషయం గురించి ఎన్నో చర్చలు జరుగుతుంటాయి. భారతదేశంలో కూడా ఒక జంట కలిసి ఉండలేకపోతే చట్టబద్ధంగా విడిపోవచ్చు అని ఉంది.

Second-Marriage-Without-Divorce

కాబట్టి న్యాయానికి అనుగుణంగానే ఆ జంట విడిపోతారు. అయితే చట్టంలో కూడా విడాకులు ఇవ్వడానికి కొన్ని నియమాలు ఉంటాయి. విడాకులు ఇచ్చేముందు చట్టం కూడా కొన్ని పద్ధతులు అనుసరిస్తుంది. కేవలం కొన్ని కారణాలకి మాత్రమే విడాకులు ఇస్తారు. సాధారణంగా ఒక జంట ఏదైనా బలమైన కారణం ఉంటే కానీ విడిపోరు. కానీ కొంత మంది మాత్రం చిన్నచిన్న కారణాలకి విడాకుల వరకు వెళ్తారు.

కానీ చట్ట పరంగా మాత్రం కొన్ని కారణాలకు మాత్రమే విడాకులు ఇస్తారు. అందులో ఒకటి మానసికంగా వేధించడం. కొట్టడం లాంటి వాటికి కచ్చితంగా విడాకులు ఇస్తారు. కానీ మానసికంగా వేధించడం కూడా ఒక రకమైన వేధింపులే కాబట్టి ఒక భర్త కానీ, భార్య కానీ, వారి భాగస్వామిని అవమానించి, కించపరిచి వారు మానసికంగా బలహీనంగా అయ్యేలా చేస్తే అలాంటి కారణానికి కూడా విడాకులు ఇస్తారు. మరొక కారణం క్రూరత్వం. ఇక్కడ కూడా క్రూరత్వం అంటే కేవలం కొట్టడం మాత్రమే కాదు.

indian divorce changed rules 2023 year

అబద్ధాలు చెప్పడం, మోసం చేయడం కూడా దీని కిందకి వస్తుంది. కొంత మంది అయితే తమ భాగస్వామిపై తప్పుడు ఆరోపణలు కూడా వేస్తారు. ఇది కూడా ఒక రకమైన క్రూరత్వం అంటారు. ఈ విషయంలో భాగంగా సుమన్ టీవీ తో ప్రముఖ లాయర్ సాయి కృష్ణ ఆజాద్ మాట్లాడుతూ ఈ అసలు ఎలాంటి కారణాలకు విడాకులు ఇస్తారు అనే విషయాన్ని చెప్పారు. అంతే కాకుండా హిందూ వివాహ చట్టం ప్రకారం ఎలాంటి సెక్షన్లలో ఎలాంటి నియమాలు ఉంటాయి అనే విషయాన్ని కూడా చాలా వివరంగా చెప్పారు. ఈ విషయంపై ఇంకా వివరంగా తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చూడండి.

watch video :

ALSO READ : తల్లి ఆస్తి కూతురికి చెందుతుందా..? కొడుకుకి చెందుతుందా..? చట్టం ఏం చెప్తోంది..?


End of Article

You may also like