Ads
పెళ్లితో ఎవరికైనా కొత్త జీవితం ప్రారంభం అవుతుంది. అమ్మాయిల జీవితంలో భర్తగా.. అలాగే అబ్బాయిల జీవితంలోకి భార్యగా కొత్త వ్యక్తి వస్తుంటారు. మిగతా అన్ని బంధాలు ఎలా ఉన్నా.. భార్యా భర్తల బంధం మాత్రం చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే వారిద్దరూ జీవితాంతం కలిసి ఉండాలి.
Video Advertisement
ఎన్ని అభిప్రాయం భేదాలు, ఆటుపోట్లు వచ్చినా వారిద్దరూ సర్దుకుపోతూ కలిసి మెలసి ఉండాలి. కొన్ని సార్లు భర్త కూడా సర్దుకుపోతూ ఉండాల్సి వస్తుంది. ఇద్దరు సర్దుకుపోకుండా మాటలు అనుకుంటూ ఉంటె.. ఆ బంధం బీటలు వారుతుంది.
అయితే మీ లైఫ్ పార్ట్ నర్ తో మీరెప్పటికీ విడిపోకూడదు అనుకుంటే.. మీరు వారికి కొన్ని ప్రామిస్ లు చేయాల్సి ఉంటుంది. ఏ బంధంలో అయినా ప్రేమ ఎంత ముఖ్యమో.. నమ్మకం కూడా అంతే ముఖ్యం. ఏ బంధంలో అయినా చిన్న చిన్న కొట్లాటలు, గొడవలు జరగడం అనేది సహజమే. అయితే ఇలాంటి చిన్న చిన్న గొడవలు వల్ల మీ లైఫ్ పార్ట్ నర్ తో విడిపోకూడదు అని అనుకుంటే వారికి కొన్ని ప్రామిస్ లు చేయండి.
మీ భాగస్వామి పట్ల శ్రద్ధ తీసుకోండి. వారిని సంతోష పెట్టడానికి, వారిని ప్రత్యేకంగా చూపించడానికి ఏ చిన్న అవకాశం వచ్చినా వదులుకోకండి. మీ భాగస్వామికి నచ్చని అలవాట్లు మీకు ఉంటె.. వాటిని కచ్చితంగా మానేస్తానని ప్రామిస్ చేయండి. మీకు దుఃఖం కలిగినా, ఆనందం కలిగినా వారితో పంచుకోండి. మీ ప్రతి మూమెంట్ లోను మీ భాగస్వామి ఉండేలా చూసుకోండి.
కష్ట సమయం వచ్చినప్పుడు మీ భాగస్వామిని వదిలేయకుండా వారి భావోద్వేగాల్ని పంచుకోండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబెర్స్ తో ఎటువంటి నిజాయితితో రిలేషన్ మైంటైన్ చేస్తారో.. అలానే మీ భాగస్వామితో కూడా ఉండండి. నిజాయితీ లేని రిలేషన్ ఎంత వరకు అయినా వెళ్లొచ్చు. జీవితంలో పరిస్థితులు ఎప్పుడు ఒకలా ఉండవు. కొన్ని పరిస్థితులలో బంధాలు సులువుగా బ్రేక్ అయ్యే అవకాశం ఉంది. అలాంటప్పుడు మీ భాగస్వామి పట్ల మీరు వ్యవహరించే తీరే మీ బంధాన్ని సేవ్ చేస్తుంది.
End of Article