Ads
ఒకప్పటి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అంజలి గుర్తున్నారా..? “ప్రేమించుకుందాం రా” సినిమా లో వెంకటేష్ సరసన చూడ చక్కని స్మైల్ తో ఆకట్టుకుని తెలుగువారికి బాగా దగ్గరైపోయారు. ఆ తరువాత బాలకృష్ణ సరసన సమరసింహా రెడ్డి, చిరంజీవి తో నటించిన “చూడాలని ఉంది” సినిమాలు కూడా అంజలి కి మంచి పేరు తెచ్చిపెట్టాయి. కెరీర్ పీక్ స్టేజి లో ఉండగానే అంజలి సినిమాలకు దూరం అయ్యారు.
Video Advertisement

ఓ ఫేమస్ ఆక్టర్ ను వివాహం చేసుకున్న తరువాత అంజలి కుటుంబానికే పరిమితం అయిపోయారు. ఇంతకీ అంజలి పెళ్లి చేసుకున్నది ఎవరినో కాదు. టాలీవుడ్ ఫేమస్ ఆక్టర్, విలన్ తరుణ్ అరోరా… వీరిద్దరూ భార్యాభర్తలన్న సంగతి చాలా మందికి తెలియదు. ఇటీవల వీరిద్దరూ కలిసి తీసుకున్న ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.

అంజలి మెగాస్టార్ సరసన హీరోయిన్ గా నటిస్తే.. తరుణ్ అరోరా చిరు రీ ఎంట్రీ ఇచ్చిన” ఖైదీ 150 ” సినిమాలో విలన్ గా నటించి మెప్పించారు. అర్జున్ సురవరం, జయ జానకి నాయక, కాటమ రాయుడు వంటి సినిమాల్లో కూడా విలన్ గా మెప్పించారు. ఇటీవల తరుణ్ అరోరా భార్య అంజలి తో కలిసి దిగిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. అంజలి అప్పటికీ ఇప్పటికీ ఏమి మారలేదని నెటిజన్లు కితాబిస్తున్నారు.
#3

#4

#5

#6

#7

End of Article
