‘వరుడు కావలెను’ దర్శకురాలు లక్ష్మీ సౌజన్య గురించి మీకు ఈ విషయాలు తెలుసా..?

‘వరుడు కావలెను’ దర్శకురాలు లక్ష్మీ సౌజన్య గురించి మీకు ఈ విషయాలు తెలుసా..?

by Megha Varna

Ads

ఎప్పుడూ కూడా ఎవరికి బాగు చేయకపోయినా పరవాలేదు కానీ ఎవర్నీ చెడగొట్టకూడదు అనేది బలంగా ఈ దర్శకురాలు నమ్ముతారు. పైగా చిత్రాలను కూడా దీనికి తగ్గట్టుగానే ఉండాలని ఆమె అనుకుంటూ ఉంటారు. ఆమె ఎవరో కాదండి యువ దర్శకురాలు లక్ష్మీ సౌజన్య. ఈమె గురించి మనకి పరిచయం చాలా తక్కువ. ఈ మధ్యనే వెలుగులోకి వచ్చిన ఈ దర్శకురాలి గురించి మనం ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం. ఇప్పుడిప్పుడే వెలుగులోకి వచ్చిన యువ దర్శకురాలు లక్ష్మీ సౌజన్య ”వరుడు కావలెను” సినిమాతో దర్శకురాలిగా పరిచయం అయ్యారు. ఈమె కర్నూలు జిల్లా వెంకటాపురం లో జన్మించారు.

Video Advertisement

 

కానీ ఈమె గుంటూరు జిల్లా నరసరావుపేట లో పెరిగారు. ఈమె తండ్రి లెక్చరర్. చిన్నతనం నుండి కూడా ఈమె ఎంతో యాక్టివ్ గా ఉండేవారు. ఆటపాటల్లో కూడా ఎంతో ఆసక్తిగా ఈమె పాల్గొనేవారు. అలానే చదువులో కూడా ముందుండే వారు అని చెప్పాలి. ఎందుకంటే ఈమె తన 11 ఏళ్లకే పదో తరగతి పరీక్షలు రాశారు.

 

చిన్నప్పటి నుండి ఈమె కి సినిమాలంటే ఎంతో ఇష్టం. ఆ ఇష్టంతోనే ఇప్పుడు దర్శకురాలు అయ్యారు. అయితే ఈమె ఆటల్లో బాగా చురుకుగా ఉండటంతో తన తండ్రి ఈమె ప్లేయర్ అవుతారు అనుకున్నారట. ఇదిలా ఉంటే ఈమెకి 18 ఏళ్ళ వయసులో ఉన్నప్పుడు హైదరాబాద్ వచ్చేశారు. కట్ చేస్తే ఈమె ఒక ప్రకటన చూడడం… ఆ తర్వాత ప్రముఖ దర్శకుడు తేజ ఈమెకి సహాయ దర్శకుడిగా అవకాశం ఇవ్వడం జరిగింది. దానిని దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాక ఈమె శేఖర్ కమ్ముల, కృష్ణవంశీ, క్రిష్ లాంటి ప్రముఖ దర్శకులతో కలిసి పని చేశారు.

 

 

ప్రస్తుతం ఈమె వివాహం గురించి సినిమా చేశారు. నాగ శౌర్యకి, లక్ష్మీ సౌజన్య ఛలో సినిమా సక్సెస్ మీట్ లో పరిచయం అయ్యారట. అప్పుడు నాగ శౌర్యకి వరుడు కావలెను సినిమా కథ వినిపించారు. నాగ శౌర్యకి కథ నచ్చి సినిమా చేద్దాం అని అన్నారట. కానీ కరోనా కారణంగా ఆలస్యం అయ్యింది. ఇది అయిపోయాక ఆధార్ కార్డు కి సంబంధించి మరొక సినిమాతో సిద్ధంగా వున్నారు.


End of Article

You may also like