Ads
కృష్ణవంశీ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వచ్చిన సినిమా “మురారి”. ఈ సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయం అయ్యి అందరి మనస్సులో చెరగని ముద్ర వేసిన ముద్దుగుమ్మ సోనాలి బింద్రే. సోనాలి బింద్రే అందరికీ సుపరిచితమే. ఈ అందాల తార హిందీ, కన్నడ, తమిళ్, మరాఠి చిత్రాలలో కూడా నటించారు. మురారి, ఇంద్ర, ఖడ్గం, మన్మధుడు వంటి తెలుగు చిత్రాలలో నటించి ఈమె ఎంతగానో మెప్పించారు.
Video Advertisement
అలానే ఈ భామ శంకర్ దాదా ఎంబీబీఎస్ చిత్రంలో మెగాస్టార్ సరసన నటించారు. అదే ఆమె హీరోయిన్ గా చేసిన ఆఖరి చిత్రం. ఆ తర్వాత ఈమె హీరోయిన్ గా మరే సినిమాలో కూడా నటించలేదు. ఆ తరవాత ఈమె కేవలం రెండు సినిమాల్లో గెస్ట్ రోల్స్ చేశారు. పెళ్లి తర్వాత ఈమె సినిమాలకి గుడ్ బాయ్ చెప్పేశారు.
కానీ శంకర్ దాదా చిత్రంలో నటించమని మెగాస్టార్ అడగగా ఆమె ఆ చిత్రంలో హీరోయిన్ గా నటించారు. ఇది ఇలా ఉంటే ఈమె క్యాన్సర్ తో పోరాడి బయటపడ్డారు. ఇక సోనాలి బింద్రే కొడుకు విషయానికి వస్తే.. ఆమె కొడుకు గురించి చాలా మందికి తెలియదు. మరి తన కొడుకు ఎవరు..?, ఇప్పుడు ఏం చేస్తున్నాడు అనేది చూస్తే.. నటి సోనాలి బింద్రే కొడుకు పేరు రణ్వీర్ బెహల్. ఇప్పటికే తాను ఒక బాలీవుడ్ చిత్రంలో నటించారు. త్వరలోనే తన కొడుకు హీరోగా కూడా గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.
డైరెక్టర్ గోల్డీ బెహెల్ ను పెళ్లి చేసుకున్న సోనాలి సినిమాలకు దూరంగానే ఉంటూ వచ్చారు. వీరికి రణ్వీర్ బెహల్ అనే ఓ కొడుకు కూడా ఉన్నాడు. 2018 వ సంవత్సరంలోనే కాన్సర్ బారిన పడ్డ సోనాలి బింద్రే ఆ జబ్బుని ఓడించి బయటపడ్డారు. ప్రస్తుతం సోనాలి బింద్రే ఆరోగ్యంగానే ఉన్నారు. సినిమాలకు దూరమైనప్పటికీ ఆమె భర్త సోనాలి బింద్రేకు ఎంతగానో సపోర్ట్ చేసారు. తిరిగి తన వృత్తి లోకి రావడానికి కూడా సహకారం అందిస్తున్నారు. త్వరలోనే సోనాలి బింద్రే ను మనం తెరపై చూడాలని కోరుకుందాం.
End of Article