Ads
టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జునకు తెలుగు నాట ఎంత ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వరుస సినిమాలు, బిగ్ బాస్ రియాలిటీ షో హోస్టింగ్ తో బిజీ బిజీ గా ఉండే నాగార్జున గతేడాది బంగార్రాజు సినిమా సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్నారు.
Video Advertisement
మన్మథుడిగా తెలుగు ఇండస్ట్రీలో నాగార్జునకు తిరుగు లేని ఫ్యాన్ బేస్ ఉంది. అక్కినేని నట వారసత్వాన్ని అందిపుచ్చుకుని.. లవర్ బాయ్ గా రాణించారు. ఆ తరువాత అన్నమయ్య, శ్రీ రామ దాసు వంటి భక్తి రసాత్మక చిత్రాలలో కూడా నటించి మెప్పించారు.
సినిమాల్లోకి రాకముందు నాగార్జున అమెరికాలో చదువుకుంటూ ఉండేవారు. అయితే.. ఆయనను ఇండియాకు తీసుకొచ్చి హీరోగా పరిచయం చేయాలా వద్దా? అనే డైలమా ఏఎన్నార్ కు ఉండేది. అయితే.. నాగార్జున కూడా ఆసక్తి కనబరిచేసరికి సినిమాల్లోకి తీసుకురావాలని అనుకున్నారు. “విక్రమ్” పేరుతొ 1986 లో నాగార్జున హీరోగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసారు. అయితే.. నాగార్జున కెరీర్ మొదట్లో చాలా సినిమాలలో ప్రేక్షకులకు కనెక్ట్ అవ్వలేదు. తరువాత శివ సినిమాతో నాగార్జునకు బ్రేక్ వచ్చింది. ఆ తరువాత వచ్చిన గీతాంజలి మరింత మంచి ఫాలోయింగ్ ను తీసుకొచ్చింది.
అయితే, సినిమాల్లోకి వచ్చే సమయంలోనే నాగార్జున కొంత కష్టపడాల్సొచ్చింది. ముచ్చట కథనం ప్రకారం.. నాగార్జున ఎంట్రీ ఇచ్చే సమయంలోనే అక్కినేని తన అభిమానులందరికి ఓ బహిరంగ లేఖని రాసారు. ఈ లేఖలో గత 42 ఏళ్లుగా తనని ఆదరించి , అభిమానించిన ప్రేక్షకులను ఉద్దేశించి రాసారు. ఇన్నేళ్లు నన్ను అభిమానించారు.. విమర్శించారు.. బలపరిచారు.. అందుకు కృతజ్ఞుడినని పేర్కొన్నారు. మానవ బలహీనతలను ప్రకోపింప చేస్తూ సినిమాల్లో సక్సెస్ అయ్యే వాళ్ళు ఎంత మంది ఉన్నా.. నా సినిమాలు కుటుంబ సమేతంగా వెళ్లి చూసేవే అయి ఉండాలని అనుకున్నాను. అందుకు నా అభిమానులు సహకరించారు.
నా అభిమానులకు ఉన్న సంస్కారం వల్లే నా సినిమాలు తల్లి, చెల్లితో కలిసి వెళ్లి చూడగలిగేవిగా ఎంచుకోవడం సాధ్యమైంది. అందుకు మీకు జోహార్లు.. నా రెండో కుమారుడు సంతానం అమెరికాలో బిఎస్, ఎం ఎస్ చేసాడు.. అయితే.. సినిమాపై అభిమానంతో ఇండస్ట్రీకి రావాలనుకుంటున్నాడు. నన్ను అభిమానించినట్లే నాగార్జునని కూడా అభిమానించి.. ఆదరిస్తారని.. ప్రోత్సహిస్తారని భావిస్తున్నాను.. తన పుట్టిన రోజు అయిన ఆగష్టు 29 న అతని సినిమా రంగప్రవేశం గురించి కూడా చెప్తాము. మనసారా ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నా..” అంటూ ఏఎన్నార్ లేఖ రాశారు. ఈ లేఖతో పాటు నాగార్జున ఫోటోను కూడా జత చేసారు.
End of Article