ఏజెంట్ సినిమా కోసం ”అఖిల్” తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

ఏజెంట్ సినిమా కోసం ”అఖిల్” తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

by kavitha

Ads

యంగ్ హీరో అఖిల్ అక్కినేని గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. సిసింద్రీ చిత్రం ద్వారా చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి అఖిల్ ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత ‘అఖిల్’ చిత్రం ద్వారా హీరోగా మారాడు.

Video Advertisement

2021 లో వచ్చిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ సినిమా హిట్ గా నిలిచింది. అఖిల్ తాజాగా ఏజెంట్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. ఈ మూవీకి అఖిల్ ఎంత పారితోషికం తీసుకున్నాడనే దానిపై చర్చ జరుగుతోంది. మరి అఖిల్ ఏజెంట్ మూవీకి ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నాడో ఇప్పుడు చూద్దాం..
 అక్కినేని నాగార్జున కుమారుడిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన అఖిల్ కి హీరోగా మొదటి సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఆ తర్వాత పలు చిత్రాలు చేసినప్పటికి వాటిలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ మాత్రమే హిట్ గా నిలిచింది.  ప్రస్తుతం అఖిల్ భారీ హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ నేపథ్యంలోని డైరెక్టర్ సురేందర్ రెడ్డి తెరకెక్కించిన  ఏజెంట్ సినిమాలో నటించాడు. స్పై థ్రిల్లర్ సినిమాగా రూపొందిన ఈ చిత్రం నేడు రిలీజ్ అయ్యింది.
రీసెంట్ గా ఈ మూవీ ప్రమోషన్స్ లో చిత్ర యూనిట్ పలు ఇంటర్వ్యూలు ఇచ్చారు. అఖిల్ ఈ మూవీకి సంబందించిన చాలా  విషయాలను మీడియాకు వెల్లడించారు. ఇక ఈ మూవీకి హీరో అఖిల్ ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారనే  విషయాన్ని ఈ మూవీ ప్రొడ్యూసర్ అనిల్ సుంకర వెల్లడించారు.
నిర్మాత అనిల్ సుంకర మాట్లాడుతూ 80 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీకి అఖిల్ పారితోషికం తీసుకోకుండానే వర్క్ చేసినట్లు తెలిపారు. ఈ మూవీ నిర్మాణంలో అఖిల్, డైరెక్టర్ సురేందర్ రెడ్డి ఇద్దరు భాగమయ్యారని నిర్మాత వెల్లడించారు. మా సినిమా కోసం వర్క్ చేసిన వారంతా వారి మొత్తం రెమ్యూనరేషన్ తీసుకుంటే మూవీ బడ్జెట్ వంద  కోట్లు అయ్యేదని అన్నారు. అయితే అఖిల్, సురేందర్ రెడ్డి రెమ్యూనరేషన్ తీసుకోకుండా తమ రెమ్యూనరేషన్ని మూవీ నిర్మాణంలో పెట్టుబడిగా పెట్టారని తెలిపారు.
ఇక ఈ చిత్రానికి బడ్జెట్ ఏమాత్రం సమస్య కాదని థియేటర్ మరియు డిజిటల్ పరంగా మూవీ సేఫ్ లోనే ఉంటుందని ప్రొడ్యూసర్స్ బడ్జెట్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదని తెలిపారు. మొత్తానికి హీరో అఖిల్, డైరెక్టర్ సురేందర్ రెడ్డి రెమ్యూనరేషన్ తీసుకోకుండానే ఏజెంట్ చిత్రానికి పనిచేశారు. ఈ చిత్రం మంచి విజ‌యం సాధిస్తే, వచ్చిన లాభాల్లో వీరికి కొంత వాటా వ‌స్తుంద‌ని అంటున్నారు.

Also Read: AGENT REVIEW : “అఖిల్ అక్కినేని” కి మరొక హిట్ పడినట్టేనా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!


End of Article

You may also like