చాలా రెస్టారెంట్లలో జరిగే ఈ స్కామ్ ను గమనించారా..? తెలియకుండా వెళ్లి మోసపోకండి..!

చాలా రెస్టారెంట్లలో జరిగే ఈ స్కామ్ ను గమనించారా..? తెలియకుండా వెళ్లి మోసపోకండి..!

by Anudeep

Ads

మనం తరచుగా రెస్టారెంట్స్ కి వెళుతూనే ఉంటాం. వారాంతాల్లోనో.. మరేదైనా స్పెషల్ అకేషన్ ఉంటేనో మన సన్నిహితులతో, కుటుంబ సభ్యులతో కలిసి లంచ్ లేదా డిన్నర్ కి వెళ్తూ ఉంటాం. ఇండియన్ ఫుడ్ లో చాలా మందికి ఆఖరికి పెరుగు తినే అలవాటు ఉంటుంది. ఈ క్రమం లోనే రెస్టారెంట్స్ కూడా చివరిలో పెరుగుతో చేసిన రైతా లేదా గడ్డ పెరుగు కచ్చితం గా ఉండేలా చూసుకుంటాయి.

Video Advertisement

curd 1

మనం సాధారణం గా ఇంట్లో పాలు కాచి తోడుపెట్టిన పెరుగు కంటే రెస్టారెంట్స్ లో లభించే పెరుగు ఎక్కువ గా గడ్డ కట్టి కనిపిస్తుంది. మనం ఇంట్లో తోడు పెట్టిన పెరుగు గడ్డ గానే ఉన్నప్పటికీ ఒక్క గరిట తో తీయగానే తిరిగి స్మూత్ గా అయిపోతుంది. ఇంట్లో ఉండే పెరుగు స్వచ్ఛం గా ఉంటుంది. కానీ రెస్టారెంట్స్ లో ఎంతమంది వచ్చినా.. అందరికి గడ్డ పెరుగే వడ్డిస్తారు. ఇది ఎలా సాధ్యమవుతుందో తెలుసా..?

curd 2

ఈ ప్రశ్నకి ఓ కోరా యూజర్ సమాధానం ఇచ్చారు. అతనికి తెలిసిన సన్నిహితులు కూడా హోటల్ వ్యాపారం లో ఉండడం తో అతను ఈ విషయాలను తెలుసుకున్నారట. ఇంతకీ రెస్టారెంట్స్ లో జరిగే మోసం ఏమిటంటే.. వీరు ఎక్కువ సేపు పెరుగు గడ్డ కట్టి ఉండడానికి మొక్క జొన్న పిండి ని కలుపుతుంటారట. అంతే కాదు పెరుగు లోని టేస్ట్ పోకుండా ఉండడం కోసం కొంచం వెనిగర్ ను కూడా కలుపుతారు.

curd 3

ఈ రెండు పదార్ధాలు మనం తినే పదార్ధాలు కాబట్టి ఈ పెరుగు హానికరమేమి కాదు. కానీ.. ఇలాంటి ట్రిక్స్ తో హోటల్ యాజమాన్యాలు కస్టమర్లను ఎలా చీట్ చేస్తున్నాయో చూడాలి. భోజనం చేయడానికి వచ్చే కస్టమర్లు పెరుగు కోసమే డబ్బు చెల్లిస్తారు తప్ప మొక్క జొన్న పిండికి, వెనిగర్ కి కాదు. ఈ పెరుగు శరీరానికి హాని చేయకపోవచ్చు.. కానీ, పెరుగు లోని స్వచ్ఛత మాత్రం కచ్చితం గా పోతుంది. అందుకే.. మీ కేవలం స్వచ్ఛమైన ఆహరం తీసుకోవాలనుకుంటే.. ఇటువంటి వాటిని తినకుండా ఉండడం మేలు.


End of Article

You may also like