“స్టూడెంట్ నెంబర్ 1 ” సినిమా హీరోయిన్ గజాల గుర్తుందా..? ఇప్పుడెక్కడుందో.. ఏమి చేస్తోందో తెలుసా..?

“స్టూడెంట్ నెంబర్ 1 ” సినిమా హీరోయిన్ గజాల గుర్తుందా..? ఇప్పుడెక్కడుందో.. ఏమి చేస్తోందో తెలుసా..?

by Anudeep

Ads

సినిమా ఇండస్ట్రీ ఓ రంగుల ప్రపంచం. ఇక్కడకి వచ్చాక అవకాశాలు వచ్చేదాకా ఒక బాధ వచ్చాక ఒక బాధ అన్నట్లు ఉంటుంది. ఫేమ్ సంపాదించుకోవడమే కాదు.. దానిని నిలబెట్టుకోవడం కూడా కష్టమే. ఎందుకంటే అవకాశాలు వచ్చినప్పుడు బాగా గుర్తుపెట్టుకుంటారు. ఆ తరువాత పట్టించుకోవడమే మానేస్తుంది ఈ సమాజం. అలా.. తెరవెనుకే కనుమరుగైపోయిన హీరోయిన్లలో “గజాల” ఒకరు.

Video Advertisement

1 gajala

ఒకప్పుడు గజాల తెలుగు, తమిళ్, మలయాళ సినిమాల్లో స్టార్ హీరోయిన్ గా వెలుగొందింది. రంగుల ప్రపంచం సృష్టించిన పరిస్థితుల్లో పడి ఆమె మరణం అంచుల వరకు వెళ్ళొచ్చింది. 2001 లో తెలుగు తెరకు గజాల పరిచయం అయింది. ఎంత వేగం గా పాపులర్ అయిందో.. అంతే వేగం గా కనుమరుగైపోయింది. ఇండస్ట్రీ లో ఓ యువ హీరో ప్రేమ మాయలో పడి..అతను మోసం చేశాడంటూ ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది. అయితే, అదృష్టవశాత్తు ఆ గండం నుంచి గట్టెక్కింది.

gajaala 1

ఆ టైం లో యాక్షన్ హీరో అర్జున్ ఆమెకు సాయం అందించడం తో ఆమె తిరిగి సాధారణ పరిస్థితికి రాగలిగింది. ఒకవేళ అర్జున్ సాయమందించకపోయి ఉంటె.. ఆమె మరణించి ఉండేది. ఇలా జరిగిన తరువాత గజాల మళ్ళీ తెరపై కనిపించలేదు. “నాలో ఉన్న ప్రేమ” సినిమా ద్వారా గజాల తెలుగునాట తెరంగ్రేటం చేసారు. జూనియర్ ఎన్టీఆర్ తో “స్టూడెంట్ నెంబర్ 1 ” లో నటించి అదరగొట్టింది. ఈ సినిమా తోనే తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది.

gajaala 2

మే 19 , 1985 లో జన్మించిన గజాల తెలుగునాట చాలా సినిమాలే చేసింది. కలుసుకోవాలని, స్పీడ్ ట్రాక్, అల్లరి రాముడు, ఓ చిన్నదాన, రామ్, మనీ మనీ మోర్ మనీ, అదృష్టం, జానకి వెడ్స్ శ్రీరామ్, భద్రాద్రి, మద్రాసి, శ్రావణ మాసం, విజయం, వంటి సినిమాలు చేసింది. ఇవి కాకుండా, తమిళ్, మలయాళం లలో కూడా గజాల సినిమాలు చేసింది. అర్జున్ సరసన కూడా గజాల పలు సినిమాలు చేసింది.

gajalaa

లవ్ ఫెయిల్యూర్ వ్యధ నుంచి బయటపడ్డ గజాల మళ్ళీ సినిమాలలో చేయలేదు. ఆమె కుటుంబం మొత్తం కువైట్ లో స్థిరపడ్డప్పటికీ.. సినిమాలపై మక్కువ తోనే.. ఆమె ఇండియా లో ఉండి పలు సినిమాలలో నటించింది. సినిమాలు వదిలేసాక.. ఆమె ముంబై కి వెళ్ళిపోయింది. అక్కడ, టివి నటుడు ఫైజల్ రాజా ఖాన్ తో గజాల కు పరిచయం అయింది. ఆ పరిచయం ప్రేమ గా మారి వారిద్దరూ వివాహం చేసుకున్నారు. నాలుగేళ్లు ప్రేమించుకున్న తరువాత వీరిద్దరూ 2016 లో పెళ్లి చేసుకున్నారు. గజాల కూడా సినిమాలకు స్వస్తి పలికి భర్త దర్శకత్వం లో సీరియల్స్ లో నటించాలని భావిస్తోంది.


End of Article

You may also like