బెల్లంకొండ శ్రీనివాస్ “ఛత్రపతి” మూవీ ప్రమోషన్స్ కోసం ఎంత ఖర్చు పెట్టారో తెలుసా?

బెల్లంకొండ శ్రీనివాస్ “ఛత్రపతి” మూవీ ప్రమోషన్స్ కోసం ఎంత ఖర్చు పెట్టారో తెలుసా?

by kavitha

Ads

స్టార్ ప్రొడ్యూసర్ కుమారుడిగా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన బెల్లంకొండ శ్రీనివాస్ తనదైన సినిమాలతో ఆడియెన్స్ ని అలరించాడు. ఈ క్రమంలోనే తాజాగా ‘ఛత్రపతి’ మూవీతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు.

Video Advertisement

ఈ చిత్రం తొలి రోజు 55 లక్షల నెట్ కలెక్షన్స్ సాధించి నిరాశ పరిచింది. అయితే ఈ మూవీ కోసం నెల రోజులుగా చాలా ఏరియాల్లో ప్రమోషన్స్ ని చేశారు. బాలీవుడ్ లో అంతగా ప్రభావాన్ని చూపలేకపోయిన ఈ మూవీ గురించి తాజాగా ఒక వార్త బయటకు వచ్చింది. అది ఏమిటి ఇప్పుడు చూద్దాం..
దర్శకధీరుడు రాజమౌళి, యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ మూవీ ‘ఛత్రపతి’ ని టాలీవుడ్ డైరెక్టర్ వీవీ వినాయక్ బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా హిందీలో రీమేక్ చేశాడు. తాజాగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే మొదటి రోజు కలెక్షన్స్ చూసి అంతా షాక్ అయ్యారు. బెల్లంకొండ శ్రీనివాస్ హిందీలో డబ్ అయిన చిత్రాలకు యూట్యూబ్ లో రికార్డ్ లెవల్ లో వ్యూస్ రావడంతో ఛత్రపతి సినిమాని భారీ లెవల్ లో హిందీలో రీమేక్ చేశారు. కానీ 55 లక్షల వసూళ్లతో మూవీ యూనిట్ ను తీవ్రంగా నిరాశ పరిచింది.
రెండవ రోజు 45 లక్షలు సాధించి బాక్సాఫీస్ దగ్గర ఈ చిత్రం తేలిపోయింది. ఈ మూవీ కోసం గత నెల రోజులుగా సినిమా కోసం చాలా ఏరియాల్లో ప్రమోషన్స్  చేశారు మూవీ యూనిట్. కానీ ఇలాంటి ఓపెనింగ్స్ ను చూసి చిత్ర యూనిట్ నిరాశ పడుతున్నారు. బాలీవుడ్ లో అంతగా ఎఫెక్ట్ చూపని ఈ చిత్రం గురించి తాజాగా ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఈ మూవీ ప్రమోషన్స్ కోసం కోటి 20 లక్షల నుండి కోటిన్నర వరకు మేకర్స్ ఖర్చు పెట్టారని సినీ వర్గాల్లో వినిపిస్తోంది.    అయితే ఇంత ఖర్చు పెట్టి ప్రమోషన్స్ చేసినప్పటికీ, ఛత్రపతి హిందీ సినిమా ఫస్ట్ డే 60 లక్షలు కూడా కలెక్ట్ చేయలేక పోయింది. ఇక ఈ మూవీకి పెన్ స్టూడియోస్ సంస్థ సుమారు అరవై కోట్లు బడ్జెట్ పెట్టిందట. అయితే మూవీ రిలీజ్ కు ముందే ఆ డబ్బుని పలు రకాల రైట్స్ గా రాబట్టుకుందని తెలుస్తోంది. అయితే ప్రమోషన్ కి పెట్టిన ఖర్చులో 10 శాతం కలెక్షన్స్ కూడా ఈ మూవీ 2 రోజుల్లో సాధించలేకపోయింది. ఇది ప్రొడ్యూసర్స్ కి భారం అని టాక్.

Also Read : “SJ సూర్య” నుండి “AR మురగదాస్” వరకు… పక్క రాష్ట్రాల హీరోలకి “ఫ్లాప్ సినిమాలు” ఇచ్చిన 14 ఇతర ఇండస్ట్రీల డైరెక్టర్స్..!


End of Article

You may also like