Ads
సాధారణంగా మన ఆలోచనలలాంటివే ఇంకొకరికి వస్తూ ఉండటం చూస్తూనే ఉంటాం. దానికి కొంత మంది కాపీ అని పేరు పెడితే, కొంత మంది ఇన్స్పిరేషన్ అంటారు. ఇలాంటివి సినిమాల్లో ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఒక సినిమా కథని పోలిన కథతో మరొక సినిమా రావడం, కాస్ట్యూమ్స్ ఒకేలా ఉండడం, ఇలాంటివన్నీ అవుతూనే ఉంటాయి.
Video Advertisement
ఇంకా కొన్ని సందర్భాల్లో పాటలు ఒకే లాగా ఉండటం కూడా జరుగుతూ ఉంటాయి. అలా సర్దార్ గబ్బర్ సింగ్ లో ఓ పాట, అమితాబ్ బచ్చన్ సినిమాలోని ఓ పాట ట్యూన్ ఒకేలా ఉన్నాయి.
సర్దార్ గబ్బర్ సింగ్ లో వచ్చే”హే తౌబా తౌబా తౌబా తౌబా తోడుగుంది దిల్ -ఉ రూబా” పాట మ్యూజిక్ ని గమనించండి. ఇది అమితాబ్ బచ్చన్ పాట నుంచి కాపీ చేయబడింది. సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ అమితాబ్ బచ్చన్ యొక్క ‘లావారిస్’ నుండి మ్యూజికల్ బీట్ ను కాపీ చేశారు. ఇప్పుడు ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
బిగ్ బి ఫిల్మ్‌లోని సూపర్ హిట్ క్లబ్ సాంగ్ కళ్యాణ్ జీ – ఆనంద్ జీ స్వరపరిచిన ‘అప్నీ తో జైసే తైసే’ మరియు ఆ తర్వాత షారుఖ్ ఖాన్ ‘మే హూ నా’లో ‘తుమ్సే మిల్కే పాట కోసం అదే ట్యూన్ ను మరోసారి ఉపయోగించారు. ఇప్పుడు పవన్-లక్ష్మి రాయ్ నర్తించిన “తౌబా తౌబా'” పాటకి కూడా అదే ట్యూన్ ను ఉపయోగించారు. మరో విషయం ఏంటంటే.. పవన్ కళ్యాణ్ కావాలనే అమితాబ్ బచ్చన్ పాట ట్యూన్ కావాలని అలాంటి ట్యూన్ నే చేయించారు అనే టాక్ కూడా వినిపిస్తోంది.
Watch Video:
https://www.youtube.com/watch?v=Ow_SJD1gKDY
End of Article