తెలుగు సినీ పరిశ్రమకి ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు రెండు కళ్లలా లాంటివారు. హీరోలుగా అడుగుపెట్టి తమ ప్రతిభతో అత్యున్నత స్థాయికి చేరుకోవడమే కాకుండా తెలుగు ఇండస్ట్రీ కోసం ఎంతో కృషి చేశారు.
Video Advertisement
మద్రాసు నుండి సినీపరిశ్రమ హైదరాబాద్ కు తరలి రావడానికి చాలా కృషి చేశారు. వందల సినిమాలలో నటించి, ప్రేక్షకులను అలరించారు. తెలుగు సినీ ఇండస్ట్రీ ఎప్పటికీ మరచిపోలేని గొప్పనటులు వీరు. ఈ మహా నటుల ఇద్దరి మధ్య కొన్ని పోలికలు ఉన్నాయి. అవి ఏమిటో ఇప్పుడు చూద్దాం..
ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ 1964లో ప్రవేశపెట్టిన నంది అవార్డులు ఎన్టీఆర్, ఏయన్‌ఆర్ నటించిన సినిమాలకు వచ్చాయి. వీరిద్దరూ హిందీ, తమిళ చిత్రాలలో నటించారు. అలాగే వీరిద్దరూ కృష్ణా జిల్లాకు చెందినవారు. ఎన్టీఆర్ నిమ్మకూరు నుండి వస్తే, ఏయన్నార్ గుడివాడలోని వెంకట రాఘవపురం నుండి వచ్చారు. వీరిద్దరూ ఇండస్ట్రీకి తమ వారసులను అందించగా, వారిద్దరూ టాలీవుడ్ లో టాప్ హీరోలుగా ఇప్పటికీ రాణిస్తున్నారు.
నందమూరి, అక్కినేని కుటుంబాల నుండి మూడవ జనరేషన్ వారసులు ఇండస్ట్రీలో అడుగుపెట్టి, స్టార్ హీరోలుగా రాణిస్తున్నారు. ఎన్టీఆర్ మనవడు జూనియర్ ఎన్టీఆర్ స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు. అలాగే కళ్యాణ్ రామ్, తారకరత్న, చైతన్య కృష్ణ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. ఇక ఏయన్ఆర్ మనవళ్ళు నాగ చైతన్య, అఖిల్ మాత్రమే కాకుండా సుమంత్, సుశాంత్ కూడా పలు సినిమాలలో నటించారు.
ఎన్టీ రామరావు తన భార్య పేరుతో బసవ తారకం క్యాన్సర్ హాస్పటల్ ను నిర్మించగా, ఏయన్ఆర్ తన భార్య పేరుతో అన్నపూర్ణ స్టూడియోను నిర్మించారు. వీరిద్దరి భార్యలు వీరి కన్నా ముందు మరణించారు. ఎన్టీ రామరావు రాజకీయాల్లోకి అడుగుపెట్టి, పార్టీ పెట్టాలనుకున్నప్పుడు ఏయన్ఆర్ తో సంప్రదించారు. ఏయన్ఆర్ ని పాలిటిక్స్ లోకి ఆహ్వానించారు. నాగేశ్వరరావు ఆరోగ్య సమస్యల వల్ల రాలేనని, ఎన్టీ రామరావుకు అభినందనలు తెలిపారు.
ఎన్నో సినిమాలలో కలిసి నటించిన వీరు అభిప్రాయభేదాలతో చాలా ఏళ్లు మాట్లాడుకోలేదు. ఆ తరువాత మళ్ళీ కలిసిపోయారు. ఎంతో అనుబంధం ఉన్న వీరిద్దరు ఎన్ని అభిప్రాయ భేదాలు వచ్చినా, ఏరోజు బహిరంగంగా నిందించుకోలేదు. తెలుగు ఇండస్ట్రీకి క్రమశిక్షణ, స్టార్‌డమ్ నేర్పిన ఈ లెజండరీ నటులిద్దరూ జనవరి నెలలోనే తుదిశ్వాస విడిచారు.
Also Read: విజయ్ ఆంటోనీ కూతురు చనిపోయే ముందు రాసిన చివరి లెటర్..! “వాళ్లని మిస్ అవుతాను..!” అంటూ..?