ఈ ఫోటోలో నమ్రత, సితార ల మధ్య ఉన్న… ఆమె ఎవరో తెలుసా?

ఈ ఫోటోలో నమ్రత, సితార ల మధ్య ఉన్న… ఆమె ఎవరో తెలుసా?

by kavitha

సూపర్ స్టార్ కృష్ణ ఇటీవలే కన్నుమూసిన సంగతి తెలిసిందే. కృష్ణ సంతాప సభ, చిన్న కర్మ కార్యక్రమాల్లో రమేష్ బాబు భార్య, పిల్లలు హాజరయ్యారు. కృష్ణ ఫోటో వద్ద పూలు ఉంచి నివాళులర్పించారు. వీరితో మహేష్ బాబు, నమ్రత దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Video Advertisement

మహేష్ బాబు కుటుంబంలో ఈ ఏడాది తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ సంవత్సరం మొదట్లోనే మహేష్ అన్నయ్య, కృష్ణ పెద్ద కుమారుడు రమేష్ బాబు కన్నుమూశారు. సెప్టెంబర్‏లో కృష్ణ సతీమణి, మహేష్ తల్లి ఇందిలా దేవి మరణించగా, నవంబర్ 15న సూపర్ స్టార్ కృష్ణ తుదిశ్వాస విడిచారు. మూడవ రోజు ఘట్టమనేని కుటుంబం హైదరాబాద్‏లోని ఫిలింనగర్ కల్చరల్ క్లబ్ లో సంతాప సభను ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి  కుటుంబసభ్యులు, సినీ ఇండస్ట్రీకి చెందిన కొద్దిమంది ప్రముఖులు మాత్రమే హాజరయ్యారు.
gattamaneni-Bharathi--telugu-addaఈ కార్యక్రమానికి రమేష్ బాబు భార్య, పిల్లలు వచ్చారు. కృష్ణ సంతాప సభలో, చిన్న కర్మ కార్యక్రమాల్లో వారు పాల్గొన్నారు. కృష్ణ ఫోటో వద్ద పూలు ఉంచి నివాళులర్పించారు. వీరితో మహేష్ బాబు దిగిన ఫోటోలు సోషల్ మెడీఏఆలో వైరల్ అయ్యాయి. ఈ క్రమంలో రమేష్ బాబు కూతురుకు సంబంధించిన మరి కొన్ని ఫోటోలు కూడా సోషల్ మీడియా వేదికగా బయటకు వచ్చాయి. ఈ ఫోటోల్లో చూడటానికి ఎంతో అందంగా, గ్లామరస్ గా కనిపిస్తోంది రమేష్ బాబు కూతురు sభారతి. ఈ ఫోటోలు చూసిన వారు సోషల్ మీడియా వేదికగా అనేక కామెంట్లు పెడుతున్నారు.
gattamaneni-Bharathi--1-telugu-addaఅయితే కృష్ణ వారసులుగా రమేష్ బాబు మరియు మహేష్ బాబు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇద్దరిలో మహేష్ బాబు స్టార్ హీరోగా కొనసాగుతున్నారు. రమేష్ బాబు నటుడిగా సినిమాలు చేసినప్పటికి విజయం పొందలేకపోయాడు. రమేష్ బాబు ఫ్యామిలీ గురించి కానీ అతని పర్సనల్ విషయాల గురించి గానీ చాలా మందికి తెలియదు. రమేష్ బాబు భార్య పేరు మృదుల, కొడుకు పేరు జయకృష్ణ కాగా కూతురు పేరు భారతి. వీరి గురించి ఎక్కువగా ఎవరికి తెలియదు. ఎందుకంటే రమేష్ బాబు భార్య కానీ, పిల్లలు కానీ సినిమా ఫంక్షన్లలో ఎక్కువగా కనిపించేవారు కాదు.


You may also like

Leave a Comment