అక్కినేని ఫ్యామిలీ గురించి తెలియని వారు ఉండరు. అందులో ముఖ్యంగా అక్కినేని అమల అంటే ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగింది.

Video Advertisement

ఆమె సినిమాల్లో చూపించిన అందం, అభినయంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. ఇక “హలో గురూ ప్రేమ కోసమే రా ఈ జీవితం” అంటూ ఆమె చేసిన డాన్స్ ఇప్పటికి కూడా ఎవర్ గ్రీన్ గా నిలిచిపోయింది అంటే అతిశయోక్తి లేదు.

అయితే అమల నాగార్జునను వివాహం చేసుకున్న తర్వాత ఇండస్ట్రీకి మాత్రం దూరం అయింది. తర్వాత ఆమె జంతువులపై ప్రేమ ఎక్కువగా ఉండడం వల్ల బ్లూ క్రాఫ్ట్ అనే జంతు సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసి మూగజీవాలపై తమ వంతు ప్రేమ చూపిస్తోంది. 1986లో సినీ ప్రేక్షకులకు ఎంతో దగ్గరైన అమల టీ.రాజేందర్ డైరెక్షన్ లో మీథిలి ఎన్నై కాథలి అనే మూవీలో తొలిసారిగా నటించింది ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది.

ఓవర్ నైట్ లోనే అశేషమైన పేరు సంపాదించుకొని వరుసగా 50 పైగా చిత్రాలలో నటించి ఆకట్టుకుంది అమల. అయితే అమల నాగార్జునతో శివ, నిర్ణయం లాంటి సూపర్ హిట్ మూవీస్ లో నటించింది. ఈ సమయంలోనే వారిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. కానీ నాగార్జునకు అప్పటికే వెంకటేష్ సోదరి దగ్గుబాటి లక్ష్మీతో వివాహం జరిగింది. ఆయన ఎప్పుడైతే అమలపై మనసు పారేసుకున్నారో ఆ క్షణమే లక్ష్మి కి విడాకులు ఇచ్చేసారు.

ఈ విధంగా వారి వివాహం జరిగిన తర్వాత అమల పూర్తిగా హైదరాబాదుకు మకాం మార్చింది. అమల తల్లిదండ్రుల విషయానికి వస్తే తండ్రి బెంగాలీ నేవీ అధికారి ముఖర్జీ.. తల్లి ఐర్లాండ్ దేశానికి చెందినటువంటి మహిళ.. వీరిద్దరి ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆయన నేవీ అధికారి గా చేస్తున్న సమయంలోనే డిప్యూటేషన్ మీద ఖరగ్పూర్ ఐఐటీ లో ప్రొఫెసర్ ఉద్యోగం సంపాదించారు. అమల తల్లి కూడా హాస్పిటల్లో జాబ్ చేసేది. నాగార్జునతో వివాహానంతరం అమల తల్లిదండ్రులు చాలాకాలం చెన్నై మరియు వైజాగ్ లాంటి ప్రదేశాల్లో జీవనాన్ని సాగించారు.