Ads
మెగాస్టార్ చిరంజీవి పవన్ కళ్యాణ్ లు కలిసి ఉన్న పాత ఫోటో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ ఫోటోలు చిరు, పవన్ లుక్స్ అందరిని ఆకట్టుకుంటున్నాయి. చిరు, పవన్ ఇద్దరు ఏదో వేడుకకు వెళ్ళిన సందర్భంలోని ఫోటో అని చూస్తుంటే తెలుస్తోంది.
Video Advertisement
సోషల్ మీడియాని షేక్ చేస్తున్న ఈ పిక్ లో మెగా స్టార్, పవర్ స్టార్ తో మాట్లాడుతున్న మరో వ్యక్తి కూడా ఉన్నారు. అయితే ఆ వ్యక్తి ఎవరా? అని నెటిజెన్లు ఆరా తీస్తున్నారు. దీనిపై నెట్టింట్లో చర్చలు కూడా మొదలయ్యాయి. అయితే ఆయన ఎవరో చాలా మందికి తెలిసే ఉండవచ్చు. ఆయన తెలుగు ఇండస్ట్రీలో అప్పట్లో టాప్ రచయితగా ఒక వెలుగు వెలిగారు. ఆయన గొర్తి సత్యమూర్తి అందరికి తెలిసిన పేరు జి.సత్యమూర్తి. తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం అగ్ర సంగీత దర్శకుడిగా కొనసాగుతున్న దేవి శ్రీ ప్రసాద్ తండ్రిగారే ఈ గొర్తి సత్యమూర్తి. ఆయన ఏపీలోని తూర్పుగోదావరిలోని వెదురుపాక అనే గ్రామంలో మే 24న 1953లో జన్మించారు. సత్యమూర్తి దర్శకేంద్రుడు కే. కే.రాఘవేంద్రరావు డైరెక్షన్ లో వచ్చిన ‘దేవత’ సినిమాతో రచయితగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక అప్పటి నుండి బావా మరదళ్లు, ఖైదీ నంబర్ 786, కిరాయి కోటిగాడు, పోలీస్ లాకప్, అభిలాష,ఛాలెంజ్ లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలకి కథలు అందించారు.1980, 90లలో విడుదల అయిన బంగారు బుల్లోడు, భలే దొంగ, నారీ నారీ నడుమ మురారి, అమ్మ దొంగా, చంటి, శ్రీనివాస కళ్యాణం, పెదరాయుడు, మాతృదేవోభవ, రౌడీ అన్నయ్య లాంటి ఎన్నో సక్సెస్ ఫుల్ సినిమాలకి రచయితగా చేశారు. సత్యమూర్తి 400కు పైగా చిత్రాలకు రచయితగా చేశారు. ఇక మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో మరచిపోలేని చిత్రాలు అయిన అభిలాష, ఖైదీ నెం 786, ఛాలెంజ్ లాంటి సినిమాలకి రైటర్ ఆయనే. పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన గుడుంబా శంకర్, జానీ సినిమాలకి రచయితగా చేశారు. ఆయన చెన్నైలో డిసెంబర్ 14, 2015లో కన్నుమూశారు.
Also Read: విష్ణు, మనోజ్ మధ్య గోడవలకు కారణం ఆస్తులు కాదంట.. సీక్రెట్ బయట పెట్టిన ప్రొడ్యూసర్..
End of Article