Ads
టాలీవుడ్ లో నట కిరీటిగా పేరుగాంచిన రాజేంద్రప్రసాద్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒకప్పుడు హీరోగా ఎన్నో చిత్రాలలో నటించి అలరించిన రాజేంద్రప్రసాద్. ప్రస్తుతం ఆయన వయసుకు తగ్గ పాత్రలు చేస్తూ ఆడియెన్స్ ను అలరిస్తున్నారు. ఆయన కెరీర్ లో అనేక అద్బుతమైన చిత్రాలలో నటించారు.
Video Advertisement
రాజేంద్రప్రసాద్ నటించిన చిత్రాలలో ఆడియెన్స్ కి ఎప్పటికీ గుర్తుండే చిత్రాలలో ‘ఆ నలుగురు’ మొదటి వరుసలో తప్పనిసరిగా ఉంటుంది. ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్ యాక్టింగ్ అందరి చేత కంటతడి పెట్టించింది. అయితే ఈ చిత్రంలో ముందుగా రాజేంద్రప్రసాద్ ని కాకుండా తెలుగు సీనియర్ స్టార్ హీరోను అనుకున్నారట. మరి ఆ హీరో ఎవరో? ఈ క్లాసిక్ మూవీని ఎందుకు వద్దనుకున్నారో ఇప్పుడు చూద్దాం..
రాజేంద్రప్రసాద్ ప్రధానపాత్రలో నటించిన ‘ఆ నలుగురు’ సినిమా 2004 లో రిలీజ్ అయ్యింది. ఈ చిత్రానికి చంద్ర సిద్ధార్థ దర్శకత్వం వహించారు. నటి ఆమని, కోటా శ్రీనివాసరావు, శుభలేఖ సుధాకర్, హీరో రాజా లాంటి వారు ఈ చిత్రంలో ఇతర ముఖ్య పాత్రలను పోషించారు. ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాగా రూపొందిన ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్ నటన అపూర్వం. తన నటనతో ప్రేక్షకుల చేత కంటతడి పెట్టించారు.
విమర్శకుల నుంచి ప్రశంసలు వచ్చాయి. ఇప్పటికీ ఈ మూవీ టీవిలో వస్తే చూసే ఆడియెన్స్ ఉన్నారు. అలాంటి సినిమాకి హీరోగా ముందుగా అనుకున్నది రాజేంద్రప్రసాద్ కాదు. సీనియర్ హీరో సూపర్ స్టార్ కృష్ణ. చంద్ర సిద్ధార్థ ఈ కథను సూపర్ స్టార్ కృష్ణ చెప్పడంతో ఆయనకు బాగా నచ్చి, నటించాలని అనుకున్నారంట. కానీ ఆయన వయసు రీత్యా ఎక్కువ నిడివి పాత్రలో నటించలేనని అన్నారంట.అలా రాజేంద్రప్రసాద్ నటించారు. అలాగే సినిమాలో హీరోయిన్ కోసం గౌతమి, లక్ష్మి, సుహాసిని, భానుప్రియ, రోజా వంటి వారిని సంప్రదించారట. వారు రిజెక్ట్ చేయడంతో రాజేంద్ర ప్రసాద్ ఆమనిను సూచించడంతో ఆమెను తీసుకున్నారంట. ఈ మూవీ రాజేంద్ర ప్రసాద్ కెరీర్ లో మైలు రాయిగా నిలిచిపోయింది.
Also Read: డబ్బులు ఇచ్చి మరి ట్రోలింగ్..? “అనసూయ” కామెంట్స్..! “ఇంక ఆపేయాలి అనుకుంటున్నా..!” అంటూ..?
End of Article