గతంలో అనసూయ భరద్వాజ్ విజయ్ దేవరకొండ మధ్య జరిగిన వివాదం గురించి దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. అర్జున్ రెడ్డి సినిమా విడుదల సమయంలో అనసూయ భరద్వాజ్ బహిరంగంగానే విమర్శలు చేసింది. విజయ్ దేవరకొండ కూడా అనసూయ భరద్వాజ్ మీద పరోక్షంగా కామెంట్లు చేయడంతో ఈ వ్యవహారం అప్పట్లో చాలా హాట్ టాపిక్ గా మారింది.
Video Advertisement
దీనిపై విజయ్ ఫాన్స్ అనసూయ పై ట్రోల్స్ చేయడం స్టార్ట్ చేసారు. ఇక ఈ మధ్యకాలంలో లైగర్ సినిమా దారుణమైన డిజాస్టర్ ఫలితాన్ని అందుకున్న తర్వాత కూడా అనసూయ భరద్వాజ్ చేసిన కామెంట్లు వైరల్ అయ్యాయి. అయితే తాజాగా అనసూయ ఈ వివాదం పై స్పందించింది. ఈమేరకు రీసెంట్ గా ఓ ఇంగ్లీష్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఆమె మాట్లాడారు.
ఈనాడు కథనం ప్రకారం..” విజయ్ దేవరకొండ నాకు ఎప్పటినుంచో తెలుసు. నాకు మంచి స్నేహితుడు. ఆయన నటించిన అర్జున రెడ్డి చిత్ర సమయంలో సెన్సార్ వాళ్ళు కొన్ని పదాలను మ్యూట్ చేయగా.. విజయ్ ఒక థియేటర్కి వెళ్లి ఆ మాటలను అభిమానులతో అనిపించారు. ఒక తల్లిగా నాకు బాధగా అనిపించి.. ఇలాంటివి ప్రోత్సహించొద్దని చెప్పా..కానీ ఆ తర్వాత నాపై ట్రోల్స్ మొదలయ్యాయి.
అయితే ఆ తర్వాత నాకొక విషయం తెలిసింది. విజయ్ కి సంబంధించిన ఓ వ్యక్తి నన్ను ట్రోల్ చెయ్యమని డబ్బులు ఇస్తున్నాడని తెలిసింది. ఈ విషయం విజయ్ కి తెలుసో లేదో నాకు తెలీదు. కానీ ఈ వివాదాన్ని ఇక్కడితో ఆపెయ్యాలి అనుకుంటున్నా. నాకు మానసిక ప్రశాంతత ముఖ్యం.” అని అనసూయ తెలిపారు.
అయితే వీరి వివాదం పై పలు పుకార్లు కూడా పుట్టుకొచ్చాయి. సోషల్ మీడియా ప్రకారం కామెంట్స్ ప్రకారం లైగర్ సినిమా పార్టీలో విజయ్ దేవరకొండతో అనసూయ భర్త సుశాంక్ భరద్వాజ్ గొడవ పడ్డారట. ఈ ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిందని సమాచారం. ఆ పార్టీలో లైగర్ సినిమా విషయంలో అనసూయ చేసిన కామెంట్స్ ని విజయ్ తీవ్రంగా ఖండించారట. ఈ నేపథ్యంలో విజయ్‌పై అనసూయ కోపంతో పాటు ద్వేషం కూడా పెంచుకుందని పలు వార్తలు వచ్చాయి.
Also read: “అనసూయ” కి, “విజయ్ దేవరకొండ” కి మధ్య గొడవకి కారణం అదేనా..??