గతంలో అనసూయ భరద్వాజ్ విజయ్ దేవరకొండ మధ్య జరిగిన వివాదం గురించి దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. అర్జున్ రెడ్డి సినిమా విడుదల సమయంలో అనసూయ భరద్వాజ్ బహిరంగంగానే విమర్శలు చేసింది. విజయ్ దేవరకొండ కూడా అనసూయ భరద్వాజ్ మీద పరోక్షంగా కామెంట్లు చేయడంతో ఈ వ్యవహారం అప్పట్లో చాలా హాట్ టాపిక్ గా మారింది.
Video Advertisement
దీనిపై విజయ్ ఫాన్స్ అనసూయ పై ట్రోల్స్ చేయడం స్టార్ట్ చేసారు. ఇక ఈ మధ్యకాలంలో లైగర్ సినిమా దారుణమైన డిజాస్టర్ ఫలితాన్ని అందుకున్న తర్వాత కూడా అనసూయ భరద్వాజ్ చేసిన కామెంట్లు వైరల్ అయ్యాయి. ఇక తాజాగా మరోసారి అనసూయ విజయ్ పై పరోక్షంగా ట్వీట్స్ చేసింది. అయితే అసలు అనసూయ ఎందుకు ఇంతగా విజయ్ దేవరకొండ ని ద్వేషిస్తుంది అనేది చాలా మంది ప్రశ్న..
అయితే సమాచారం ప్రకారం దీనికి ఓ కారణం కూడా ఉందని లేటెస్ట్ సోషల్ మీడియా టాక్. సోషల్ మీడియా ప్రకారం కామెంట్స్ ప్రకారం లైగర్ సినిమా పార్టీలో విజయ్ దేవరకొండతో అనసూయ భర్త సుశాంక్ భరద్వాజ్ గొడవ పడ్డారట. ఈ ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిందని సమాచారం. ఆ పార్టీలో లైగర్ సినిమా విషయంలో అనసూయ చేసిన కామెంట్స్ ని విజయ్ తీవ్రంగా ఖండించారట. ఈ నేపథ్యంలో విజయ్‌పై అనసూయ కోపంతో పాటు ద్వేషం కూడా పెంచుకుందట.
అందుకే అనసూయ వీలు దొరికినప్పుడల్లా విజయ్‌ను ఏదో రకంగా టార్గెట్ చేస్తోందని నెటిజన్స్ అంటున్నారు. తాజాగా ఆమె చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు సరికొత్త కాంట్రవర్సీకి తెర లేపింది.. హీరో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ విరుచుకుపడేలా చేసింది.
అనసూయ ట్వీట్ చేస్తూ.. “ఇప్పుడే ఒకటి చూశాను.. ‘The’నా?? బాబోయ్.. పైత్యం.. ఏం చేస్తాం.. అంటకుండా చూసుకుందాం” అని పేర్కొంది. ఖుషి సినిమా పోస్టర్స్ లో విజయ్ పేరుకి ముందు ‘The’ అనే పదాన్ని ప్రస్తావించడం వల్ల ఆమె రౌడీ స్టార్ విజయ్ దేవరకొండని టార్గెట్ చేసినట్లుగా అందరూ భావిస్తున్నారు.
Also read: అందుకే “అనసూయ” ని ఆంటీ అంటున్నారు..! అంటూ… “ఇంటింటి గృహలక్ష్మి” హీరోయిన్ కామెంట్స్..! ఏం జరిగిందంటే?