అన్నమయ్య, భారతీయుడు లాంటి సినిమాలతో అప్పట్లో యువత మనసు దోచుకుంది కస్తూరి. ఒకానొక సమయంలో వెండితెరపై తన మార్క్ చూపించిన ఈ హీరోయిన్.. ఇప్పుడు బుల్లితెపై రాణిస్తోంది. గృహలక్ష్మి సీరియల్ తో ప్రతి ఇంట సందడి చేస్తోంది కస్తూరి. అయితే నిత్యం సమాజంలోని వివాదాలు, సమస్యలు, విషయాలపై స్పందిస్తూ వార్తల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతూ ఉంటుంది కస్తూరి. అయితే ఆమె తాజాగా అనసూయను ఆంటీ అంటూ ట్రోల్ చేసే అంశం పై షాకింగ్ కామెంట్స్ చేసింది.

Video Advertisement

పాపులర్ యాంకర్ అనసూయ గతం ఎన్నో ట్రోల్స్ ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఏజ్ షేమింగ్, మహిళలను కించపరచడం వంటి ఘటనలపై అనసూయ ఇప్పటికీ ఫైర్ అవుతూనే ఉంది. దీంతో ఆమె ను ట్రోల్ చేసే వారు పెరిగిపోయారు. తనను ఆంటీ అంటూ వ‌య‌సు ఆధారంగా టార్గెట్ చేస్తున్నార‌ని, అటు వంటి వారిపై కేసు పెడ‌తాన‌ని చెప్పింది. అయితే తాజాగా ఈ ఇష్యూ పై ఓ ఇంటర్వ్యూ లో సీనియర్ నటి కస్తూరి స్పందించారు.

serial actress comments on anasuya's aunty contraversy..

” ఒక చిన్న పాప వచ్చి పిలవడానికి, అడల్ట్ వ్యక్తి వచ్చి ఆంటీ అని పిలవడానికి చాలా తేడా ఉంటుంది. చిన్నపిల్లలు కాకుండా పెద్దవారు ఎవరైనా ఒక మహిళను ఆంటీ అని పిలిచే హక్కు లేదు. వయసుతో సంబంధం లేకుండా ఏ మహిళైన ఆంటీ అని పిలిచే హక్కు పిల్లలకే ఉంటుంది. అయితే పెద్ద వాళ్ళు ఆలా పిలిచారు అంటే వాళ్ళని అగౌరవ పరచడానికి లేదా.. వేరే అర్థం తోనే ఆలా పిలుస్తారు. అనసూయ కన్నా రెట్టింపు వయసున్న హీరోలున్నారు. వాళ్లను అంకుల్ అని పిలవగలరా. నిజానికి ‘ఆంటీ’ అనే పదానికి ప్రస్తుతం డర్టీ మీనింగ్ కూడా వచ్చేసింది. కానీ అంకుల్ అనే పదంలో అదేం లేదు.” అంటూ కస్తూరి పేర్కొన్నారు.

serial actress comments on anasuya's aunty contraversy..

‘ఈ విషయంలో నేను అనసూయకే సపోర్ట్ చేస్తా. ఎలా పిలవాలో తెలియకపోతే మేడమ్ అనండి. సిస్టర్ లేదా.. అమ్మా అని పిలవండి. అదీ కాదంటే గారు అని సంబోధించండి.’ అంటూ నెటిజన్స్ చేస్తున్న ట్రోల్స్ పై తనదైన స్టైల్ లో రియాక్ట్ అయింది కస్తూరి. అయితే ఇండస్ట్రీ కి వచ్చిన తక్కువ సమయం లోనే దేశవ్యాప్తం గా గుర్తింపు తెచ్చుకున్న కస్తూరి ప్రస్తుతం వయసుకు తగిన పాత్రలు చేస్తున్నారు. అలాగే సీరియల్స్, వెబ్ సిరీస్ లలో కూడా తన హవా చూపిస్తున్నారు.