“సామజవరగమన” వంటి సూపర్ హిట్ మూవీని మిస్ చేసుకున్న హీరో ఎవరో తెలుసా..?

“సామజవరగమన” వంటి సూపర్ హిట్ మూవీని మిస్ చేసుకున్న హీరో ఎవరో తెలుసా..?

by kavitha

Ads

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ట్రెండ్ మారింది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన భారీ బడ్జెట్ సినిమాలు ఆడియెన్స్ ముందుకు వచ్చి ఊహించని విధంగా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్లు అవుతున్నాయి. కానీ అదే టైమ్ లో ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన చిన్న సినిమాలు ప్రొడ్యూసర్లకు కోట్లలో లాభాలను సాధిస్తున్నాయి.

Video Advertisement

అలాంటి చిత్రాల లిస్ట్ లో తాజాగా ‘సామజవరగమన’ చేరింది. యంగ్ హీరో శ్రీవిష్ణు నటించిన సామజవరగమన రీసెంట్ గా రిలీజ్ అయ్యి, సూపర్ హిట్ గా నిలిచింది. అయితే ఈమూవీలో మొదట అనుకున్నది అతన్ని కాదట. మరి ఈ సూపర్ హిట్ ను వదులుకున్న అన్ లక్కీ హీరో ఎవరో ఇప్పుడు చూద్దాం..
Samajavaragamanaయంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు డిఫరెంట్ సినిమాలలో నటిస్తూ, ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు. కానీ కొంత కాలంగా ఆయన నటించిన సినిమాలు ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయాయి. మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న శ్రీవిష్ణు ‘సామజవరగమన’ మూవీతో ఆడియెన్స్ ముందుకు వచ్చాడు. ఈ మూవీ మొదటి షో నుండి పాజిటివ్ టాక్ తో దూసుకెళ్లింది. ఎలాంటి అంచలనాలు లేని ఈ మూవీ సూపర్ హిట్ అయ్యింది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రంలో శ్రీవిష్ణు, సీనియర్ నరేష్ నటన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. కడుపుబ్బా నవ్వించే కామెడీ సీన్స్ తో ఉన్న ఈ మూవీ ఆడియన్స్ ను ఎంతగానో అలరిస్తోంది. ఇక ఈ మూవీ శ్రీవిష్ణు కెరీర్ లో బిగ్గెస్ట్ కలెక్షన్స్ సాధించిన మూవీగా నిలిచింది. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో ముందుగా అనుకున్న హీరో శ్రీవిష్ణు కాదంట. యంగ్ హీరో సందీప్ కిషన్ అట. దర్శకుడు రామ్ అబ్బరాజు ఈ మూవీని సందీప్ తో చేయాలని అనుకుంటే ఆ సమయంలో సందీప్ మైఖేల్ మూవీతో బిజీగా ఉండి, ఈ సినిమాకి నో చెప్పారట. అలా ఈ సినిమా శ్రీవిష్ణు దగ్గరికి వచ్చిందని తెలుస్తోంది. సందీప్ ఒక సూపర్ హిట్ సినిమాను ను మిస్ అయ్యాడు.

Also Read: “రుద్రవీణ” సినిమా జనాలకి ఎలా అర్ధం అయ్యింది..? ఈ నెటిజెన్ చెప్పిన సమాధానం చూస్తే హ్యాట్సాఫ్ అనాల్సిందే..!


End of Article

You may also like