మ్యూజిక్ డైరెక్టర్ తమన్ భార్య ఎవరో తెలుసా.. ఆమె గురించి ఈ సీక్రెట్ బయటపడింది..?

మ్యూజిక్ డైరెక్టర్ తమన్ భార్య ఎవరో తెలుసా.. ఆమె గురించి ఈ సీక్రెట్ బయటపడింది..?

by Sunku Sravan

Ads

ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీ లో లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ గా దూసుకెళ్తున్నారు తమన్. ఈయన గంటసాల వెంకట రామయ్య మనవడు. ప్రస్తుతం ఇండస్ట్రీలో తమన్ హవా నడుస్తోంది అని చెప్పవచ్చు. తమన్ ఏది ముట్టుకున్నా బంగారం అవుతోంది. ఇక ఆయన భాషతో సంబంధం లేకుండా అన్ని ఇండస్ట్రీల్లో కూడా సంగీతాన్ని అందిస్తూ ముందుకు పోతున్నారు. ఇక చాలామంది స్టార్ హీరోలు కూడా తమన్ మాత్రమే సినిమాలో మ్యూజిక్ ఇవ్వాలని అంటున్నారు. అల వైకుంఠపురం మూవీలో సాంగ్స్ ఇప్పటికీ యూట్యూబ్ లో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి. అఖండ బిజీఎం విని థియేటర్లలో అభిమానులు ఎలా ఊగిపోయారో మనం చూశాం.ప్రస్తుతం సర్కారు వారి పాట మూవీతో మరొక సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. అలాగే ఆయన చేతిలో ఫాదర్- ఆర్ సి -15 మూవీస్ ఉన్నాయి. ఎన్నడూ లేనట్టుగా తమన్ మొదటిసారి తన భార్య మరియు ఆయన కొడుకు గురించి ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు.ఆయన భార్య పేరు శ్రీ వర్దిని.. ఆమె కూడా ప్లే బ్యాక్ సింగర్.. ఆవిడను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆమె గతంలో మణిశర్మ – యువన్ శంకర్ రాజా వద్ద పని చేసింది. ఆమె తమను కంపోజింగ్ లో కూడా కొన్ని పాటలను పడిందట. కానీ తన సినిమాల ద్వారా ఆమెను ప్రమోట్ చేయడం తనకు ఇష్టం లేదని చెప్పారు. ఆమె వాయిస్ చాలా బాగుంటుంది.నిర్మాతలు దర్శకులు భావిస్తేనే ఆమెతో పాటలు పాడిస్తానని అన్నారు.. అయితే రాబోయే రోజుల్లో తన భార్యతో కలిసి స్టేజ్ షోలు కూడా చేయాలని తమన్ భావిస్తున్నారట.. అలా చేయాలంటే ఆమె కనీసం 1,2 సూపర్ హిట్ పాటలు పాడి ఉండాలనే కండీషన్ పెట్టారు.ఇక తమను కొడుకు అచ్యుత్ ప్రస్తుతం ఇంటర్మీడియట్ చదువుతున్నాడని, మొదటిగా నా ట్యూన్ అతనే వింటాడని, అలా విన్న తర్వాత అభిప్రాయం చెబుతాడు. అలాగే అచ్యుత్ కు సంగీతానికి సంబంధించినటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలు వాడటంలో ఒక మంచి పట్టు ఉంది. పియానో వాయించడం లో నాలుగవ గ్రేడ్ కూడా పూర్తి చేశారు.. కానీ అతడు ఏ ప్రొఫెషన్ ను ఎంచుకుంటాడో..నాకు తెలియదని తమన్ చెప్పారు.

Video Advertisement


End of Article

You may also like