హీరోయిన్స్ ని సెలెక్ట్ చేసుకునే విషయంలో…రవితేజ ఎందుకు ఇలా చేస్తున్నారు?

హీరోయిన్స్ ని సెలెక్ట్ చేసుకునే విషయంలో…రవితేజ ఎందుకు ఇలా చేస్తున్నారు?

by Anudeep

Ads

సినిమాల్లో తనదైన టైమింగ్ లో అటు హీరోయిజాన్ని ఇటు  కామెడీని ఇరగదీసే హీరో మాస్ మహా రాజా రవితేజ. సినిమా ఇండస్ట్రీలో ఎటువంటి సపోర్ట్ లేకుండా ఎదిగిన హీరో రవితేజ. తన సొంత టాలెంట్ తో  తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు.

Video Advertisement

కర్తవ్యం చిత్రంతో తన సినీ కెరీర్ ని స్టార్ట్ చేసిన రవితేజ నటుడిగా ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ తనకంటూ మొదటిలో ఒక గుర్తింపును సాధించుకున్నారు. ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం చిత్రంతో హీరోగా తన కెరీర్ ని మొదలు పెట్టి వెనుతిరిగి చూడలేదు రవితేజ. అంచలంచలుగా ఎదుగుతూ  తనకంటూ ఒక మాస్ ఇమేజ్ బ్రాండ్ని సెట్ చేసుకున్నారు రవితేజ.

Also read: మా “సర్కారు వారి పాట” సినిమాని ఇలా చేశారేంటండీ..? వైరల్ అవుతున్న తమిళ్ డబ్బింగ్ వెర్షన్..!

ఆయన నటించే ప్రతి చిత్రము ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. ఆయన ముందు ఎలాంటి పెద్ద హీరోయిన్ చేసిన డామినేట్ అయిపోతారు. ఎందుకంటే ప్రేక్షకులను సైతం తనవైపే ఆకర్షించుకునే విధంగా ఉంటుంది రవితేజ నటన. రవితేజ కథా పరంగా మార్పుల విషయంలో ఎలాంటి జోక్యం చేసుకోరు గాని, ఆ కథ తనకు సెట్ అయితే మాత్రం కొన్ని విషయాల్లో ఆయన పక్కాగా ఉంటారు.

ఇంతకీ ఆ విషయం ఏంటంటే .. ఏ హీరో అయినా తనతో నటించే హీరోయిన్స్ టాప్ లిస్ట్ హీరోయిన్స్ ని కోరుకుంటూ ఉంటారు. కాని మన రవితేజ మాత్రం  తనతో నటించే హీరోయిన్స్ ఎవ్వరు ఉండాలనేది ఆయనే నిర్ణయిస్తారట. దీనికోసం ఆయన దగ్గర ఒక పెద్ద లిస్ట్ ఉంటుంది. ఏలాంటి బ్యాక్గ్రౌండ్ లేని హీరోయిన్ ని ఆయన చిత్రాలలో సెలెక్ట్ చేస్తుంటారు. ఫలానా అమ్మాయి మన సినిమా హీరోయిన్ అని  నిర్మొహమాటంగా దర్శకనిర్మాతలకు చెప్పేస్తారట.

Also read: “విరాట పర్వం” సినిమాలో హీరోగా మొదటిగా అనుకున్న… ఆ స్టార్ ఎవరో తెలుసా..?

Ravi teja heroin list

మరి చెప్పింది మాస్ మహారాజా రవితేజ అయినప్పుడు దర్శక నిర్మాతలు సైతం ఆయన సెలెక్ట్ చేసిన అమ్మాయిని హీరోయిన్ గా సినిమాల్లో సెట్ చేస్తారు. అంటే ఈ విధంగా కొత్త అమ్మాయిలను హీరోయిన్స్ గా సెలెక్ట్ చేయడం ద్వారా తన సినిమాలతో వాళ్లకి అవకాశాలు కల్పించినవారు అవుతున్నారు రవితేజ.


End of Article

You may also like