మనం మన జీవితంలో పరిచయమైన కొందరు స్నేహితులని కుటుంబ సభ్యుల్లా భావిస్తాం, మనకు సంబంధించిన ప్రతి విషయాన్ని వారితో పంచుకోవాలి అని ఆలోచిస్తాము. కానీ అలా చేయడం వల్ల కొన్ని దుష్ఫలితాలు కలుగుతాయని, మనం ఎవరితోనైనా ఎంతవరకు మనకు సంబంధించిన విషయాలు షేర్ చేసుకోవచ్చు అనేదానికి పరిధిలో ఉంటాయని నిపుణుల అభిప్రాయం.

Video Advertisement

ఈ కొన్ని పాటి జాగ్రత్తలు తీసుకోకపోతే మన మనసుపై నెగిటివ్ ప్రభావం ఎక్కువగా పడుతుంది అని అంటున్నారు.

మనల్ని మనలా అర్థం చేసుకోకుండా ధరించే వస్త్రాలను బట్టి ,ప్రవర్తనను బట్టి ఆకారాన్ని బట్టి అంచనా వేసేవారు స్నేహితులు ఎప్పటికీ కారు. చాలామందికి అవతల వారిలోని ఆత్మన్యూనత ఎత్తిచూపడం సరదాగా ఉంటుంది. అలాంటి వాళ్లకు వీలైనంత దూరంగా ఉండడం మేలు.

స్నేహితుడు అంటే మన సక్సెస్ తన సక్సెస్ గా భావించి ఆనందించేవాడు, అంతేకానీ తనకు రాని విజయం అవతల వాళ్లకు దక్కింది అని కృంగిపోయేవాడు ఎప్పటికీ నిజమైన స్నేహితుడు కాదు. ఆస్తులు ,అంతస్తులు, టాలెంట్, కుటుంబ నేపథ్యం ఇవన్నీ లెక్కలేసుకొని చేసేది స్నేహం కాదు.

సమయాన్ని పరిస్థితిని బట్టి ఎవరైనా మారాల్సిందే కానీ ఆ మార్పు అనేది సౌకర్యవంతంగా ఉండాలే తప్ప బలవంతంగా ఉండకూడదు. మీ అభిప్రాయానికి విరుద్ధంగా అవతల మనిషి కోసం ప్రతి విషయంలో రాజీ పడాల్సి వస్తే అలాంటి వారు స్నేహితురాలు ఎలా అవుతారు.స్నేహంలో థాంక్స్ కి సారీ కి చోటు ఉండదు, కానీ చిన్న చిన్న విషయాల్లో ఈ పదాలు వాడడం అనేది ఎంతో అవసరం…ఒకరి పట్ల ఒకరికి బాధ్యత కృతజ్ఞతా లేని ఏ బంధమైనా శాశ్వతంగా నిలబడదు అది స్నేహమైనా సరే.


స్నేహంలో నీది నాది అనే భేదం ఉండకూడదు అంటారు కరెక్టే కానీ అది ఇరుపక్కల ఒకే తీరులో ఉంటేనే ఆ బంధం ఎక్కువ సేపు నిలబడుతుంది. అలా కాకుండా ఎప్పుడూ ఒక మనిషి మనకోసం సర్దుకోవాలి అనే మనస్తత్వం ఉంటే అతను ఎప్పటికీ మంచి స్నేహితుడు కాలేడు.