సినీ పరిశ్రమలో కేవలం హీరోల వారసులే కాకుండా స్టార్ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ కుమారులు కూడా హీరోలుగా ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. అయితే వారిలో కొందరు విజయం సాధించగా, కొందరు విజయం కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు. అలాంటి వారిలో కోదండ రామిరెడ్డి కుమారుడు వైభవ్ రెడ్డి కూడా ఒకరు.

Video Advertisement

టాలీవుడ్ దర్శకుల గురించి రాయాల్సి వస్తే అందులో కోదండ రామిరెడ్డి గురించి ఎంతో ప్రత్యేకమైన పేజీ రాయాల్సి ఉంటుంది. చిరంజీవికి వరుసగా హిట్లు ఇచ్చి మెగాస్టార్ గా నిలబెట్టింది దర్శకుడు కోదండ రామిరెడ్డి. అలాంటి గొప్ప దర్శకుడు కోదండ రామిరెడ్డి తన చిన్న కుమారుడు వైభవ్ ను హీరోగా పరిచయం చేస్తూ ‘గొడవ’ అనే సినిమాని తెరకెక్కించారు. అయితే అది యావరేజ్ గా నిలిచింది.
Vaibhav-reddy ఆ తరువాత తర్వాత దర్శకుడు నాగేశ్వరరెడ్డి డైరెక్షన్ లో ‘కాస్కో’ అనే చిత్రాన్ని చేశాడు. ఆ సినిమా యావరేజ్ గా నిలిచింది. ఆ తర్వాత చేసిన చిత్రాలు అంతగా ఆడకపోయేసరికి తెలుగు హీరో అయిన వైభవ్ తమిళ ఇండస్ట్రీకి వెళ్ళిపోయాడు. వైభవ్ తమిళ సినిమాలలో నటించడం ప్రారంభించారు. అయితే కోలీవుడ్ లో ఆయన విజయం సాధించడానికి చాలా సమయం పట్టింది. ఈ క్రమంలో ఆయన హీరోగా నటించిన ‘మియాదామన్’ అనే చిత్రం కోలీవుడ్ లో మంచి విజయం సాధించింది.
ఎంతలా అంటే కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ ‘మెర్సల్’ మూవీని కూడా అధిగమించి సూపర్ హిట్ అందుకుంది. ఆ చిత్రంతో కోలీవుడ్ లో వైభవ్ కెరీర్ హీరోగా మలుపు తిరిగింది. ఈ విజయంతో తన కుమారుడిని హీరోగా నిలబెట్ట లేకపోయానని బాధపడుతున్న కోదండరామ్ రెడ్డి సంతోషించారని చెబుతారు. ప్రస్తుతం వైభవ్ కు తెలుగులో అంతగా చెప్పుకునే చిత్రాలు లేనప్పటికీ, కోలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోగా ఎదిగే దిశలో సాగుతున్నాడు.

Also Read: “దువ్వాడ జగన్నాథం” తో పాటు… సీన్స్ వల్ల “కాంట్రవర్సీ” సృష్టించిన 16 సినిమాలు..!