అప్పుడు స్టార్ హీరో చెల్లెలుగా నటించిన ఈ నటిని గుర్తుపట్టగలరా..?

అప్పుడు స్టార్ హీరో చెల్లెలుగా నటించిన ఈ నటిని గుర్తుపట్టగలరా..?

by kavitha

Ads

ఇండస్ట్రీలో హీరోయిన్స్ కు ఉండే క్రేజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే హీరోయిన్లకే కాకుండా సినిమాలలో సహయ పాత్రలు చేసిన నటిమణులకు కూడా సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ముఖ్యంగా హీరో సిస్టర్ పాత్రలో నటించి  మూవీకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన తారల ఎంతోమంది ఉన్నారు.

Video Advertisement

అలాంటి పాత్రలు చేసి, గుర్తింపు తెచ్చుకున్నవారిలో సంజన సారథి కూడా ఒకరు. అయితే సంజన సారథి  అంటే గుర్తుపట్టలేరు. కానీ తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి సిస్టర్ అనగానే ఈజీగా గుర్తుపడతారు. ఆమె గురించి ఇప్పుడు చూద్దాం..

విజయ్ దళపతి హీరోగా నటించిన తుపాకీ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రానికి ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వం వహించాడు.  ఈ మూవీ తెలుగులో కూడా మంచి విజయాన్ని సాధించింది. ఈ చిత్రంలో విజయ్ రెండవ చెల్లిగా సంజనా సారథి నటించింది. తన సహజమైన నటనతో ఆకట్టుకుంది. ఆమె పాత్రకు గాను ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత వరుస ఆఫర్స్ రావడంతో పలు సినిమాలలో కీలకపాత్రలు చేసి ఆడియెన్స్ దగ్గరయ్యింది.

సంజన సారథి 2012లో బాలాజీ శక్తివేల్ దర్శకత్వంలో వచ్చిన ‘వజక్కు ఎన్ 18/9’ సినిమాతో ఇండస్ట్రీలో అడగుపెట్టింది.  ఆ తర్వాత ఎనై నోకి పాయుమ్ తోట, ఎండ్రెండ్రుమ్ పున్నగై, వాలు,  బ్రో సినిమాలో నటించింది. టైమ్ ఎన్నా బాస్, ఫింగర్‌టిప్,  లటి వెబ్ సిరీస్ లలో నటించి గుర్తింపు తెచ్చుకుంది.  తెలుగులో ‘సరసాలు చాలు’ అనే మూవీతో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా పెద్దగా మెప్పించకపోవడంతో ఆమెకు గుర్తింపు దక్కలేదు. దాంతో మళ్ళీ కోలీవుడ్ కు వెళ్ళిపోయింది.

ప్రస్తుతం సినిమాల్లో నటిస్తూ, సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది. లేటేస్ట్ ఫోటోస్ ను ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఫ్యాన్స్ ని పలకరిస్తుంది. తాజాగా జిమ్ వర్కవుట్ ఫోటోను సంజన షేర్ చేయగా, సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఒకప్పుడు విజయ్ సిస్టర్ గా కనిపించిన అమ్మాయి, ప్రస్తుతం హీరోయిన్ లా ఉందని నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: “బాలకృష్ణ” కి అప్పుడు హీరోయిన్‌గా, ఇప్పుడు తల్లిగా నటించిన… ఒకే ఒక్క నటి ఎవరో తెలుసా..?


End of Article

You may also like