“మన్మధుడే బ్రహ్మను పూని సృష్టించాడేమో” అని అనిపించే అందాల తార గోపిక. నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్ సినిమాలో చక్కని నటనతో అందరినీ కట్టిపడేసిన ఈ కేరళ కుట్టి యువసేన, లేతమనసులు సినిమాల్లో కూడా తనదైన నటనతో అందరినీ మెప్పించింది.

Video Advertisement

ఆమెను చూసిన దక్షిణాది ప్రేక్షకులకు స్వల్పకాలంలోనే దగ్గరై ఇప్పుడు కనిపించడం లేదు. “మల్లీశ్వరివే మధురాశల మంజరివే అంటూ” కుర్రాళ్ళను మళ్లీమళ్లీ పాడేలా చేసిన ఆమె ఇప్పుడు ఎక్కడ ఉందో తెలుసుకుందామా.

ఈ అమ్మాయి ఎయిర్ హోస్టెస్ కావాలనుకుని అనుకోకుండా సినీనటి అయిపోయింది. మలయాళంలో తన సినీరంగాన్ని మొదలుపెట్టారు. తెలుగులో యువసేన సినిమా ఆమెను సక్సెస్ ఫుల్ తారగా మార్చేసింది. దాదాపు 30 సినిమాల్లో మెరిసి ఒక్కసారిగా ఎందుకు తెరమరుగై పోయారు.

కెరీర్ విజయవంతంగా సాగుతున్న టైంలో అజిలీస్ చాకు అనే ఐర్లాండ్ కి చెందిన వైద్యున్ని పెళ్లాడింది. అప్పుడే సినీరంగాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయింది. ప్రస్తుతం గోపిక గారికి ఒక కొడుకు,కూతురు ఉన్నారు. పదేళ్ల కిందట వెండితెరకు దూరమైన ఈమె గత లాక్డౌన్ సమయంలో ఎలా ఉన్నారో తెలియజేస్తూ కొన్ని ఫొటోస్ ని షేర్ చేయడంతో ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

ఈమెకు మోహన్ లాల్,మమ్ముట్టి, చిరంజీవి అంటే చాలా ఇష్టమట. నా ప్రతిభను గుర్తించి ప్రజలు నన్ను అభిమానించారని గోపిక ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ఏది ఏమైనప్పటికీ మరోసారి ఆమె తెరపై కనిపించి అందరినీ మెప్పించాలని కోరుకుందాం.