ఇండియన్ సినిమా హిస్టరీ గురించి అందులోనూ ముఖ్యంగా తెలుగు సినిమా హిస్టరీ గురించి చెప్పాలంటే బాహుబలికి ముందు బాహుబలికి తర్వాత అని అనొచ్చు. అంతకు ముందు వరకు వేరే దేశం వాళ్ళకి ఇండియన్ సినిమా అంటే కేవలం బాలీవుడ్ సినిమా మాత్రమే గుర్తొచ్చేది. కానీ బాహుబలి తెలుగు సినిమా స్థాయిని పెంచింది.

Video Advertisement

బాహుబలి సినిమాకి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఈ సినిమాలో నటించిన వాళ్లందరికీ కూడా చాలా గుర్తింపు వచ్చింది. వారిలో మాహిష్మతి రాజ్యంలో ఉండే ఈ మహిళ కూడా ఒకరు. సినిమా విడుదలైన తర్వాత ఈమె ఎవరు అని చాలా మంది వెతకడం మొదలు పెట్టారు.

do you remember this actress in bahubali

ఆ తర్వాత ఈమె కళ్యాణ్ హీరోగా నటించిన ఎమ్మెల్యే తో పాటు ఇంకా కొన్ని సినిమాల్లో ముఖ్య పాత్రల్లో నటించారు. అంతే కాకుండా ఇటీవల విడుదలై ప్రస్తుతం సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతున్న పుష్పలో కూడా ఒక పాత్రలో నటించారు. ఈ నటి పేరు కల్పలత. అయితే ఈ చిత్రంలో పుష్ప రాజ్ తల్లి కింద కల్పలత నటించారు. తల్లిగా నటించిన కల్పలత అందరినీ బాగా ఎట్రాక్ట్ చేశారు. నటనతో ఎంతో బాగా ఆకట్టుకున్నారు. దీంతో ఆమెపై ఆరాలు తీయడం మొదలుపెట్టారు.

అయితే కల్పలత తాజాగా మీడియా కి ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు. దానిలో ఆమె పాత్ర గురించి, అల్లు అర్జున్ గురించి చెప్పారు. ఈమెకు ఇద్దరు ఆడపిల్లలు. ఇద్దరు కూడా యూఎస్ లోనే ఉంటున్నారు. మగ పిల్లలు ఈమెకి లేరు. అయితే బన్నీని చూడగానే ఇలాంటి మగపిల్లవాడు ఉండాలి అని అనుకున్నారట. అలానే ఆమెకి మగపిల్లలు లేరని బాధపడ్డారట.సినిమా షూటింగ్ సమయంలో బన్నీ చాలా బాగా సపోర్ట్ చేశారు అని ఆమె చెప్పుకొచ్చారు.

do you remember this actress in bahubali

ఆమెకు సపోర్ట్ ఇస్తూ చేయి పట్టుకోవడం, నేనున్నానని భరోసా ఇవ్వడం చూసి ఆమె ఏడ్చేశారని అన్నారు. ఈమె ఇప్పటికే పలు సినిమాల్లో నటించారు. అయితే పుష్ప మాత్రం బాగా మంచి గుర్తింపుని తీసుకువచ్చింది. ఈ చిత్రంలో నటించడానికి ఆరు నెలల ముందే తనకి ఆడిషన్ నిర్వహించారని.. ఆరు నెలల తర్వాత అల్లుఅర్జున్ కు తల్లిగా నటించే అవకాశం వచ్చిందని ఫోన్ చేసి చెప్పారని ఆమె అన్నారు. ఆ ఫోన్ కాల్ రాగానే ఎంతో ఆనందపడ్డాను అని.. సుకుమార్ కి కృతజ్ఞతలు కూడా తెలిపానని అన్నారామె.