ఈ విషయాలన్నీ “లైగర్” సినిమాకి ప్లస్ అవుతాయా..? మైనస్ అవుతాయా..?

ఈ విషయాలన్నీ “లైగర్” సినిమాకి ప్లస్ అవుతాయా..? మైనస్ అవుతాయా..?

by Mohana Priya

విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా లైగర్. ఈ సినిమాతో అనన్య పాండే తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. ఈ సినిమా విడుదల అవ్వడానికి సిద్ధంగా ఉంది. సినిమా బృందం అంతా కూడా ప్రమోషన్స్ పనిలో ఉన్నారు. సినిమా గురించి ఎప్పుడైతే ప్రకటించారో అప్పటి నుంచి సినిమాపై క్రేజ్ మొదలైంది.

Video Advertisement

అందుకు రెండు కారణాలు. ఒకటి ఇది విజయ్ దేవరకొండ మొదటి పాన్ ఇండియన్ సినిమా. అర్జున్ రెడ్డి సినిమా తర్వాత విజయ్ దేవరకొండ క్రేజ్ జాతీయ స్థాయిలో పెరిగింది. ఎంతో మంది బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా విజయ్ దేవరకొండ నటన వారికి బాగా నచ్చుతుంది అని చెప్పారు. అలాంటిది విజయ్ దేవరకొండలాంటి పాన్ ఇండియన్ స్థాయిలో క్రేజ్ ఉన్న నటుడి సినిమా పాన్ ఇండియన్ సినిమాగా వస్తోంది అంటే అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరొక కారణం పూరి జగన్నాధ్.

does these things become plus points for vijay devarakonda liger movie

సాధారణంగా పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించిన ఎన్నో సినిమాలు హిందీలో కూడా రీమేక్ చేశారు. అవి హిందీలో కూడా హిట్ అయ్యాయి. హిందీ మాత్రమే కాకుండా ఇతర భాషల్లో కూడా రీమేక్ చేశారు. పూరి జగన్నాధ్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పూరి జగన్నాధ్ రేంజ్ సినిమా ఇది అవుతుంది అని అందరూ అంటున్నారు. సినిమా బృందమంతా కూడా సినిమాకి సంబంధించి విడుదల చేసిన పోస్టర్స్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. పోస్టర్స్ కానీ, ట్రైలర్ కానీ, లేదా సినిమాకి సంబంధించి బయటికి వచ్చే ఏ విషయం అయినా కానీ ట్రెండ్ అయ్యే విధంగా ఉండేలా చూస్తున్నారు.

does these things become plus points for vijay devarakonda liger movie

కొన్ని నెలల క్రితం ఈ సినిమాకి సంబంధించి ఒక పోస్టర్ విడుదల చేశారు. ఆ పోస్టర్ విడుదల అయిన తరువాత బీర్ అభిషేకం చేసిన వీడియో ఒకటి వైరల్ అయ్యింది. దాన్ని చూసి చాలా మంది, “బీర్ అభిషేకం చేయడం ఏంటి?” అని కామెంట్స్ చేశారు. అక్కడితో ఆగకుండా విజయ్ దేవరకొండ పోస్టర్ ని టాటూ వేయించుకోవడం, ఇంకా చాలా చేశారు అభిమానులు. ఇవన్నీ కొంత వరకు బాగానే ఉన్నా కూడా, తర్వాత ట్రోలింగ్ కి దారి తీసింది. హీరో అయిన తర్వాత అభిమానులు ఉండటం సహజం. కానీ ఏ హీరోకి కూడా ఇలా జరగలేదు.

minus points in vijay devarakonda liger trailer

ఇదంతా జరిగి మర్చిపోయిన తర్వాత, ఇటీవల ట్రైలర్ లాంచ్ సమయంలో జరిగిన విషయాలన్నీ కూడా ఇలాగే కామెంట్స్ వచ్చేలా చేశాయి. ట్రైలర్ కి ముందు విజయ్ దేవరకొండ పోస్టర్ ఒకటి విడుదల చేశారు. ఆ పోస్టర్ కూడా చాలా చర్చనీయాంశం అయ్యింది. తర్వాత సినిమా మొదటి పాట వచ్చింది. “ఆ పాట కూడా పెద్ద గొప్పగా ఏమీ లేదు” అంటూ కామెంట్ చేశారు. “విజయ్ దేవరకొండ డాన్స్ బాగున్నా కూడా, పాట వినడానికి అస్సలు బాలేదు. ఏదో గూగుల్ ట్రాన్స్లేట్ వాడి హిందీ భాషలో ఉన్న లిరిక్స్ ని తెలుగులోకి మార్చినట్టు ఉంది” అని అన్నారు.

does these things become plus points for vijay devarakonda liger movie

ట్రైలర్ విడుదల అయ్యే ముందు కూడా జరిగిన హడావిడి అంతా ఇంతా కాదు. సుదర్శన్ థియేటర్ లో విజయ్ దేవరకొండ కటౌట్ పెట్టారు. విజయ్ దేవరకొండ కటౌట్ మాత్రమే కాకుండా దర్శకుడు పూరి జగన్నాధ్ కటౌట్ కూడా పెట్టారు. పూరి జగన్నాధ్ అంటే అంతటి క్రేజ్ ఉన్న దర్శకుడు కాబట్టి ఆయనకి కటౌట్ పెట్టినా కూడా అది సాధారణంగానే అనిపిస్తుంది. ఇదంతా ఒక ఎత్తయితే, ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ కి, హీరోయిన్ అనన్య పాండేకి కూడా కటౌట్ పెట్టడంతో చాలా కామెంట్స్ వచ్చాయి. అయినా, “ఈ సినిమా విడుదల అయ్యేటప్పుడు ఇలాంటివన్నీ చేసినా కూడా ఒక అర్థం ఉంటుంది కానీ, ట్రైలర్ లాంచ్ కే ఇంత ఎందుకు చేస్తున్నారు ?”అంటూ కామెంట్స్ వచ్చాయి.

does these things become plus points for vijay devarakonda liger movie

ఇటీవల సినిమా బృందం ముంబై లోకల్ ట్రైన్ లో ప్రయాణించారు. హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ అనన్య పాండే ట్రైన్ లో నిల్చొని ప్రయాణిస్తున్న వీడియో ఒకటి వైరల్ అయ్యింది. దీనిపై కూడా చాలా కామెంట్స్ వచ్చాయి. అందుకు కారణం ఏమిటంటే సాధారణంగా ముంబై లోకల్ ట్రైన్స్ ఎప్పుడూ రద్దీగా ఉంటాయి. అక్కడ నిల్చోవడానికి స్థలం దొరకడం కూడా చాలా కష్టమవుతుంది. అలాంటిది వీళ్ళు ఒక ఖాళీగా ఉన్న ట్రైన్ లో ప్రయాణించారు.

does these things become plus points for vijay devarakonda liger movie

అంటే సెలబ్రిటీలు కాబట్టి వీళ్ళ కోసం అలాంటి సదుపాయం కల్పించారు అని మనకి తెలిసిపోతుంది. ఇక్కడ కూడా సెలబ్రిటీ స్టేటస్ కనిపిస్తోంది. “ఒకవేళ అందరిలాగా వాళ్లు కూడా సాధారణ మనుషులు అని చెప్పాలంటే. సాధారణంగా రద్దీగా ఉన్న ట్రైన్ లోనే ప్రయాణించాలి కదా? ఇలాంటి ప్రత్యేక సదుపాయాలు అన్నీ ఎందుకు?” అని కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాకుండా వాళ్ళిద్దరూ ఒక ఖాళీ ట్రైన్ లో నిల్చుని ప్రయాణించారు. “ఖాళీగా ఉన్న ట్రైన్ లో కూర్చోకుండా నిల్చొని ప్రయాణించడం ఏంటి?” అనే కామెంట్స్ కూడా వచ్చాయి.

does these things become plus points for vijay devarakonda liger movie

విజయ్ దేవరకొండ ఎక్కడికి వెళ్ళినా కూడా సాధారణమైన చెప్పులు ధరించి వెళ్లడం కూడా వైరల్ అయ్యింది. సినిమా బృందం ప్రమోషన్స్ చాలా పెద్ద ఎత్తున ప్లాన్ చేసింది అని మనకి అర్థం అవుతోంది. కానీ, “ఇంత పబ్లిసిటీ చేస్తున్నారు. సినిమాలో నిజంగా అంత మంచి కథ ఉందా?” అనే కామెంట్స్ వస్తున్నాయి. ఎందుకంటే ఇటీవల విడుదలైన ట్రైలర్ కూడా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. కాబట్టి సినిమా బృందం చేస్తున్న ఈ ప్రమోషన్స్ అన్నీ ఈ సినిమాకి ప్లస్ అయ్యి హిట్ అవుతుందా? లేక ట్రోల్ అవుతారా? అని అంటున్నారు. కానీ ఏది ఏమైనా కూడా ఇంత అంచనాల మధ్య విడుదల అవుతోంది కాబట్టి సినిమా ఎలా ఉండబోతోందా అని ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.


You may also like