Ads
మనం మన స్ఫూర్తి గా ప్రేమించిన వ్యక్తి మన జీవితం లోకి వస్తే బాగుండు అని కోరుకుంటాం. కానీ.. మనం ఇష్టపడుతున్న వారు మనల్ని కూడా అదే ఇష్టం తో చూస్తున్నారో లేక నటిస్తున్నారో.. తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విషయం పై క్లారిటీ లేకపోవడం వలనే చాలా ప్రేమ పెళ్లిళ్లు అర్ధాంతరంగానే ముగిసిపోతున్నాయి. పెళ్లి ఎవరి జీవితం లో అయినా ఒక్కసారి వస్తేనే మధురం గా ఉంటుంది. మీ జీవితం లోకి రాబోయే అమ్మాయి ఎలా ఉండాలో ఈ ఆర్టికల్ లో చూడండి.
Video Advertisement
పెళ్లి అయిన తరువాత ఒకమ్మాయి తన కుటుంబాన్ని వదిలేసి భర్తతో కొత్త కుటుంబం ఏర్పరుచుకోవడానికి వస్తుంది. అందుకే ప్రతి భర్త.. తనని నమ్ముకుని వచ్చిన భార్య పట్ల ప్రేమతో, గౌరవం తో మెలగాలి. అప్పుడే ఆమె కలకాలం పాటు మీతో ఎలాంటి ఇబ్బంది లేకుండా మీ కష్ట సుఖాల్లో పాలుపంచుకోగలుగుతుంది. మగవారు తమ జీవిత లక్ష్యాల కోసం నిరంతరం శ్రమించాలి. అలాగే.. వారితో జీవితాన్ని పంచుకోవడానికి వచ్చిన భార్యలు కుటుంబం పట్ల శ్రద్ధ వహించాలి. ఇలా ఇద్దరు బాలన్స్ చేసుకుంటేనే ఆ కుటుంబం సంతోషం గా ఉంటుంది.
అంటే.. భర్త బాధ్యతలని భార్య గుర్తెరిగి తనకు తోచిన సలహాలతో సహకరించాలి. అలాగే.. భార్య కష్టాన్ని భర్త గుర్తించి అలసట వచ్చినపుడు చేదోడు వాదోడు గా ఉండాలి. అలాంటి భార్య/భర్త మీకు దొరికితే ఎట్టిపరిస్థితుల్లోనూ వదులుకోకండి. ఎందుకంటే.. ఇటువంటి వ్యక్తులు మీతో ఎన్ని గొడవలు పడినా చావు చేరువయ్యేంత వరకు మిమ్మల్ని వదిలిపెట్టరు. కొందరు భార్య/భర్త లు తమ భాగస్వామికి పూర్తి స్వేచ్చని ఇస్తారు. ఏదైనా పొరపాటు చేస్తే మందలిస్తారు.
ఇటువంటి వారిని కూడా తొందరపడి దూరం చేసుకోవద్దు. కొంతమంది ఐతే తమ భాగస్వామి మరొకరివైపు చూసినా, మాట్లాడిన సహించరు. ఇటువంటి వారితో కాస్త జాగ్రత్తగానే ఉండాలి. కొందరైతే అర్ధం చేసుకుని తమ జీవిత భాగస్వామి స్నేహితులను కూడా గౌరవిస్తారు. బంధాలకు విలువ ఇస్తారు. అలాంటి వారు మీకు ఎదురైతే వారితో జీవితాన్ని పంచుకోవడానికి వెనుకాడవద్దు. కొందరు అయితే నిత్యం మీ దినచర్యలో ప్రతి విషయాన్నీ గమనిస్తూ.. తప్పులు సరిచేస్తూ… మీకు నచ్చినట్లు నడుచుకుంటూ ఉంటారు. ఇలాంటి వారు దొరకడం నిజం గా ఓ వరమే. అర్ధం లేని పంతాలు, గొడవలతో ఇటువంటి వ్యక్తులకు దూరం కాకండి.
End of Article