Ads
ఎన్ని సంవత్సరాలు అయినా, ఎన్ని ఛానల్స్ వచ్చినా కూడా దూరదర్శన్ ఛానల్ అంటే మాత్రం ప్రేక్షకులకి ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. ఇది ఒక ఛానల్ మాత్రమే కాదు. ఒక ఎమోషన్. తరతరాల నుండి ఎంతో మంది దూరదర్శన్ ద్వారా వచ్చే ప్రోగ్రామ్స్, వార్తలు చూస్తూ పెరిగారు. ఇప్పటికి కూడా దూరదర్శన్ పేరు చెప్పగానే ఆ లోగో చాలా మందికి గుర్తొస్తుంది. దూరదర్శన్ తర్వాత ఎన్నో న్యూస్ ఛానల్స్, ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ వచ్చాయి. ఇప్పటి జనరేషన్ వాళ్ళకి దూరదర్శన్ అంటే పెద్దగా తెలియదు కానీ, అప్పటి జనరేషన్ వాళ్ళు ఇప్పుడు దూరదర్శన్ చూస్తూ ఉన్నా కూడా ఏదో జ్ఞాపకాల్లోకి వెళ్లిపోతారు.
Video Advertisement
అంతగా ప్రేక్షకులకు చేరువయ్యింది. దూరదర్శన్ మాత్రమే కాదు, అందులో వచ్చే సీరియల్స్, ఆ సీరియల్స్ లో నటించిన నటులు, న్యూస్ రీడర్స్ కూడా ప్రేక్షకులకి తమ ఇంట్లో వారి అంత చేరువయ్యారు. అలా దూరదర్శన్ ద్వారా ఎన్నో సంవత్సరాల నుండి రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలిసిన వ్యక్తి శాంతి స్వరూప్ గారు. దూరదర్శన్ ద్వారా పరిచయం అయిన మొదటి తెలుగు న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ గారు. శాంతి స్వరూప్ గారి వార్తలు అంటే అప్పట్లో అందరూ కూడా టీవీకి అతుక్కుపోయి చూసేవారు. అంత బాగా చెప్పేవారు. ఒక న్యూస్ చెప్తున్నారు అంటే, అది కళ్ళకి కట్టినట్టు చెప్పడం అనేది కేవలం శాంతి స్వరూప్ గారికి మాత్రమే సాధ్యం. శాంతి స్వరూప్ గారు హైదరాబాద్ లోనే పుట్టి పెరిగారు.
శాంతి స్వరూప్ గారి తండ్రి చిన్నప్పుడే చనిపోవడంతో, శాంతి స్వరూప్ గారి అన్నయ్య ఆయనని పెంచి పెద్ద చేశారు. శాంతి స్వరూప్ గారి అన్నయ్య కూడా తర్వాత ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోవడంతో, కుటుంబ బాధ్యతను శాంతి స్వరూప్ గారు చూసుకున్నారు. 1978 లో శాంతి స్వరూప్ గారు ఉద్యోగంలో చేరారు. 1983 లో న్యూస్ రీడర్ గా గుర్తింపు పొందారు. అప్పట్లో టెలీ ప్రాంప్టర్ వంటి వాళ్ళు ఉండేవారు కాదు. అంటే న్యూస్ అందించేవారు, నెక్స్ట్ ఏ న్యూస్ చదవాలి అనే విషయం చెప్పేవారు ఎవరూ లేరు. దాంతో న్యూస్ అంతా కూడా బట్టీ పట్టి తప్పులు జరగకుండా ఒకటే సారి వార్తలు చదవాల్సి వచ్చేది. అలాంటి సమయంలో కూడా శాంతి స్వరూప్ గారు చాలా బాగా వార్తలు చెప్పేవారు.
అందుకే ఆయన అంటే ఇప్పటికి కూడా చాలా మందికి అంత గౌరవం. శాంతి స్వరూప్ గారికి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డ్ కూడా వచ్చింది. శాంతి స్వరూప్ గారు 1980 లో యాంకర్ రోజా రాణి గారిని పెళ్లి చేసుకున్నారు. 1965 లో వచ్చిన తేనె మనసులు అనే సినిమాలో రోజా రాణి గారు బాలనటిగా నటించారు. రోజా రాణి గారు కొంత కాలం క్రితం ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారిద్దరూ కూడా ఐఐటీలో చదువుకొని అమెరికాలో స్థిరపడ్డారు. శాంతి స్వరూప్ గారు మంచి రచయిత కూడా. రాతి మేఘం, క్రేజ్, అర్ధాగ్ని అనే నవలలు రాశారు. ప్రస్తుతం శాంతి స్వరూప్ గారు హైదరాబాద్ లోనే ఉంటున్నారు. ఇప్పటికి కూడా కొన్ని ఇంటర్వ్యూలలో మాట్లాడుతూ, ప్రస్తుతం జరుగుతున్న సంఘటనల గురించి, న్యూస్ రీడింగ్ అనే విషయం గురించి తన అభిప్రాయాలను వ్యక్తపరుస్తూ ఉంటారు.
watch video :
End of Article