REAL STORY: 2014 లో ఫేస్‌బుక్‌లో పరిచయమైన అమ్మాయి…2018 లో పెళ్లి.! ఇలా కేవలం సినిమాల్లోనే జరుగుతుంది అనుకుంట.?

REAL STORY: 2014 లో ఫేస్‌బుక్‌లో పరిచయమైన అమ్మాయి…2018 లో పెళ్లి.! ఇలా కేవలం సినిమాల్లోనే జరుగుతుంది అనుకుంట.?

by Mounika Singaluri

Ads

ఒక మనిషి ఎలా ఫీల్ అవుతున్నాడు అనేది షేర్ చేసుకోవాలి అనే మాధ్యమాల్లో కోరా కూడా ఒకటి. ఇందులో కొన్ని ప్రశ్నలు అడిగితే, అందుకు చాలా మంది సమాధానాలు చెప్తూ ఉంటారు. అలా ఒక యూజర్ అడిగిన ఒక ప్రశ్నకి ఒక వ్యక్తి సమాధానం చెప్పారు. “ఇలా కేవలం సినిమాల్లోనే అవుతుంది అనుకుంటా” అనే ప్రశ్నకి శ్రీరామ్ అనే ఒక కోరా యూజర్ ఇచ్చిన సమాధానం ఇది. “నేను మీకు ఒక కథ చెబుతాను. 2014లో, నేను ఫేస్‌బుక్‌లోని వివిధ అమ్మాయిలకు యాదృచ్ఛికంగా ఫేస్‌బుక్ రిక్వెస్ట్ లు పెట్టాను. ఒక రోజు, నా రిక్వెస్ట్ ను మా సొంతూరు (కోయంబత్తూర్) అమ్మాయి అంగీకరించింది. ఆమె డిస్ప్లే పిక్చర్ గా పిల్లల ఫోటో పెట్టుకుంది.

Video Advertisement

ఈమె అమ్మాయేనా అనే సందేహం వచ్చింది. ఎందుకంటే 2014లో ఫేస్‌బుక్ చాలా పాపులర్ ఉన్న  సోషల్ మీడియా సైట్‌లలో ఒకటిగా ఉంది. అందువల్ల చాలా మంది అమ్మాయిల పేరుతో ఫెక్ ఐడిలను క్రియేట్ చేశారు. అలా వారు ఎందుకు చేస్తున్నారో నాకు తెలియదు. ఆ అమ్మాయి నేను ఫేస్‌బుక్‌లో రోజూ చాటింగ్‌ చేసేవాళ్లం. 2 వారాల తర్వాత నేను కొంచెం ధైర్యం చేసి తన మొబైల్ నంబర్ అడిగాను. ఆమె మొదట ఒప్పుకొకపోయినా, తరువాత నంబర్‌ను ఇచ్చింది. ఆమె అమ్మాయేనా, కాదా అని అడిగితే, దవుని దయవల్ల ఆమె అమ్మాయే అని తెలిసింది.

image source: quora/Shriram

ఆ తరువాత వాట్సాప్‌లో చాట్ చేయడం మొదలుపెట్టాం. ఆమె కోయంబత్తూరులో పని చేస్తోంది. నేను బెంగళూరులో పని చేస్తున్నాను (నేను ఇప్పటికీ బెంగళూరులో పని చేస్తున్నాను). వేరే గుర్తింపుతో నన్ను మోసం చేయడం ఇష్టం లేదని, తను చదువుకోనని చెప్పింది. ఫ్యామిలీ చూసుకోవడం కోసం 13 ఏళ్ల వయసులో చదువు ఆపేసింది. ఆమె పేద కుటుంబానికి చెందింది. నేను బాగా చదువుకుని, ప్రముఖ కంపెనీలో పని చేస్తున్నందున, ఆమె గురించి నిజం తెలిసిన తర్వాత ఆమెతో మాట్లాడటం మానేస్తానేమో అని ఆమె భయపడింది. కానీ ఆమె గురించి తెలిసిన తర్వాత ప్రేమించడం మొదలుపెట్టాను. నేను వెయిట్ చేయకుండా ఆ రోజే ప్రపోజ్ చేసాను.

అయితే ఆమె అందుకు అంగీకరించలేదు. ఆమె నన్ను కలవాలని ఉందని, ఆ తర్వాత నా ప్రపోజల్ అంగీకరించాలా వద్దా అని ఆలోచిస్తానని చెప్పింది. అప్పుడు ఆమెను కలవడం కోసం బెంగళూరు నుంచి కోయంబత్తూరు వెళ్లాను. ఆ రోజు టెన్త్  క్లాస్ బోర్డ్ ఎగ్జామ్‌కు హాజరైనప్పుడు కలిగిన భయం మళ్ళీ కలిగింది. ఆమె కోసం 30 నిమిషాలు ఎదురుచూశాను. చాలా ఆతృతతో ముందుగానే వెళ్ళాను. ఆమె కనిపించింది. నాకు ఎదురుగా స్లిమ్ అండ్ డార్క్ బ్యూటీఫుల్ అమ్మాయి కనిపించింది. చాలా మంది భారతీయ పురుషులలా కలర్ ను చూడలేదు. గంట సేపటి తర్వాత, ఆమె నా ప్రపోజల్ ను అంగీకరించింది.

image source: quora/Shriram

అప్పుటి నుండి మేము మా పెళ్లి ముందు నాలుగైదు ఏళ్ళు రిలేషన్ లో ఉన్నాము ( ఇది రాసేటప్పుడు గూస్ బంప్‌లు వస్తున్నాయి). అవును, మీరు చదివింది నిజమే, నేను భార్య పవిత్ర శ్రీరామ్‌తో గత 4 ఏళ్ళ 7 నెలలుగా సంతోషంగా ఉన్నాను. మా 5వ వివాహ వార్షికోత్సవం మే 27, 2023న. మాకు 3ఏళ్ళ 7 నెలల వయస్సు గల పాప ఉంది. మా ఫోటోలని కూడా ఈ పోస్ట్ లో యాడ్ చేశాను. మా ప్రస్తుత జీవితం గురించి నేను మీకు కొన్ని అప్డేట్స్ ను ఇవ్వాలనుకుంటున్నాను.

1. మేము సంతోషంగా ఉన్నామా అంటే, నా సమాధానం అవుననే చెప్తాను. ఎన్నో కష్టమైన పరిస్థితులని, ఆర్థిక సమస్యలను, అలాగే కొన్ని అపార్ధాలు కూడా చూసాం. ఇవన్నీ ఏదైనా ఒక బంధంలో చాలా సాధారణమైనవి. వీటితో నాకు పెద్దగా సమస్య లేదు.

2. నా భార్య ఏం చేస్తోంది అంటే, ఆమె ఫ్యాషన్ డిజైనర్ మరియు సొంతంగా వ్యాపారం ప్రారంభించాలని అనుకుంటోంది. ఆమె ధైర్యంగా, స్వంత నిర్ణయాలు తీసుకుంటుంది. ఆమె సేల్స్ ఎగ్జిక్యూటివ్. అయితే ఫ్యాషన్ డిజైనింగ్‌లో ఆమె ఒక కోర్సు చేయాలనుకుంటోంది. ఆమెకు చదువుకోవడానికి సపోర్ట్ ఇచ్చాను.  ఆమె కోర్సు పూర్తి చేసిన తర్వాత తిరుప్పూర్ ఫ్యాషన్ వీక్‌లో మొదటి స్థానాన్ని గెలుచుకుంది.

3. ఏమైనా త్యాగాలు చేయాల్సి వచ్చిందా? అవును. మేము గత సంవత్సరం నుండి లాంగ్ డిస్టెన్స్ రిలేషన్ షిప్ లోనే ఉంటున్నాము. నా భార్య తన వ్యాపారాన్ని కోయంబత్తూర్ లో మొదలు పెట్టాలి అనుకుంటోంది. నేను కూడా కోయంబత్తూర్ లో ఉద్యోగం కోసం వెతుక్కుంటున్నాను. వచ్చే సంవత్సరం నేను కోయంబత్తూర్ కి వెళ్ళిపోతాను. ఇప్పుడు మాత్రం నేను బెంగళూరు నుండి కోయంబత్తూర్ కి ప్రతి నెల రెండు సార్లు వెళ్తున్నాను.

image source: quora/Shriram

చాలా సినిమా ప్రేమకథల కంటే నా కథ గొప్పదని నమ్ముతున్నాను. చదివినందుకు ధన్యవాదములు. మా తల్లిదండ్రులను ఎలా పెళ్ళికి ఒప్పించగలిగాము అని చాలామంది అడిగారు. అయితే మా  తల్లిదండ్రులను ఒప్పించడం అంత తేలికగా జరగలేదు. మేము ఎలాగోలా పవి తల్లిదండ్రులను ఒప్పించగలిగాము. కాని మా అమ్మను ఒప్పించడానికి చాలా సమయం పట్టింది. పవి మరియు నేను మేము తీసుకున్న నిర్ణయం పై బలంగా ఉన్నాము. అయితే ఇద్దరి తల్లిదండ్రుల ఆశీర్వాదంతో మాత్రమే వివాహం చేసుకోవాలనుకున్నాము. ఇప్పుడు పవి తల్లితండ్రులు, నా తల్లిదండ్రులు ఇద్దరూ బాగానే ఉన్నారు. పవి నా తల్లిదండ్రులతో కూడా బాగానే ఉంది.

image source: quora/Shriram

 

Article sourced from: quora

Also Read: పేషెంట్ లాగా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన ఐఏఎస్ ఆఫీసర్…ఏం బయటపెట్టారంటే.?


End of Article

You may also like