Ads
చాలా రోజులు ఎదురు చూసిన తర్వాత విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లైగర్ సినిమా ఇటీవల విడుదల అయ్యింది. ఈ సినిమా గురించి ఇప్పుడు కాదు దాదాపు రెండు సంవత్సరాల నుండి ప్రేక్షకులు అందరూ ఎదురు చూస్తున్నారు. సినిమా ప్రకటించినప్పటి నుండి కూడా ఈ సినిమా విడుదల అయిన తర్వాత పూరి జగన్నాధ్ కి పాన్ ఇండియన్ స్థాయిలో గుర్తింపు వస్తుంది అని, అలాగే విజయ్ దేవరకొండ కూడా పాన్ ఇండియన్ స్టార్ అవుతారు అని అందరూ అన్నారు.
Video Advertisement
కానీ సినిమాకి సంబంధించి పోస్టర్స్, టీజర్, ట్రైలర్, పాటలు ఇలా మెల్లగా ఒకొక్కటి చూసిన తర్వాత ఇది “అసలు తెలుగు సినిమానేనా?” అని అనుమానం కూడా వచ్చింది. అయితే ఈ సినిమాలో చాలా విషయాలు ప్రేక్షకులకి చెప్పలేదు. ఇదే విషయాన్ని యూట్యూబ్ లో ఒక వ్యక్తి కామెంట్ రూపంలో పోస్ట్ చేశారు. అలా ఈ సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులకి వచ్చే ప్రశ్నలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
#1 అసలు హీరో తండ్రి ఎవరు? పేరు చెప్తారులే కానీ, ఆ వ్యక్తి ఎవరు అనేది చెప్పరు.
#2 హీరో తండ్రి బలరాంని చంపింది ఎవరు? ఆయన చనిపోయాడు అని చెబుతారు. అసలు ఆయన ఎలా చనిపోయాడు అని మాత్రం చెప్పరు.
#3 అసలు లైగర్ ఫైటింగ్ చేయడం ఎలా నేర్చుకున్నాడు? మామూలుగా స్పోర్ట్స్ డ్రామా అంటే అసలు హీరో ఇలాంటి ఏదైనా ఒక స్పోర్ట్స్ నేర్చుకునేటప్పుడు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటాడు అని చెప్తారు. కానీ ఇందులో మాత్రం అసలు అది చూపించలేదు. సినిమాలో ముఖ్యమైన విషయం ఇదే కాబట్టి ఇందులో కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సింది ఏమో అనిపిస్తుంది.
#4 హీరో చాయ్ బండి ఎక్కడ ఉంటుంది? ఎప్పుడో సినిమా మొదట్లో ఒక సారి కనిపిస్తుంది. మళ్లీ తర్వాత అసలు ఎక్కడ ఉందో, అసలు వాళ్లు ఆ చాయ్ బండి మీద చాయ్ అమ్ముతున్నారో లేదో అనే విషయం కూడా సినిమాలో ఒక్కసారైనా చూపించరు.
#5 అసలు ఫైనల్ మ్యాచ్ చూడడానికి డబ్బులు కట్టిన ఆడియన్స్ ఎక్కడున్నారు? వారి పరిస్థితి ఏమయ్యింది?
#6 ఫైనల్ అప్పోనెంట్ కి ఏమయ్యింది?
#7 సినిమా మొత్తం దేశం కోసం కొట్లాడదాం అని అంటారు. కానీ చివరికి అసలు ఫైనల్ మ్యాచ్ కి రారు? ఇదెక్కడి లాజిక్?
ఇవన్నీ మాత్రమే కాకుండా అసలు సినిమా క్లైమాక్స్ ఎవరికీ అర్థం కాలేదు. ఇంకా సీన్ ఉందేమో అని ఎదురు చూస్తున్న వారందరూ పాట రావడంతో అసలు చివరికి ఏమయింది తెలియక అయోమయంలో థియేటర్ నుంచి బయటికి వచ్చారు.
End of Article