Ads
ఎనర్జిటిక్ స్టార్ హీరో రామ్ పోతినేని హీరోగా, మాస్ సినిమాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన సినిమా స్కంద. సినిమా ట్రైలర్ చూసిన తర్వాత నుండి, సినిమా మీద “ఎలా ఉంటుందా?” అనే అంచనాలు పెరగడం కంటే, “అసలు బోయపాటి శ్రీను ఈ సినిమాలో ఎన్ని లాజిక్ లేని సీన్స్ పెడతారా?” అనే ఆసక్తి ఎక్కువగా ఉంది.
Video Advertisement
సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆసక్తికి తగ్గట్టే ఈ సినిమాలో అలాంటి లాజిక్ లేని సీన్స్ చాలా ఉన్నాయి. “బోయపాటి సినిమా అంటే, లాజిక్ మరిచిపోయి ఎంజాయ్ చేయాలి” అని అనేవాళ్ళు కూడా ఉంటారు.
కానీ ఒక పాయింట్ వరకు అది బాగానే ఉంటుంది. ఒక పాయింట్ తర్వాత అసలు అర్థం లేకుండా జరుగుతున్న సీన్స్ చూస్తూ ఉంటే ప్రేక్షకుడికి కూడా అలాగే ఏం అర్థం అవ్వకుండా ఉంటుంది. అంతే కాకుండా కొన్ని ప్రశ్నలకు సమాధానాలు కూడా ఈ సినిమాలో ఇవ్వలేదు. ఇలాంటివి జరగవు కదా అని ప్రేక్షకుడికి ఒక క్వశ్చన్ మార్క్ మిగిలిపోయింది. ఆ ప్రశ్నలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
#1 సినిమా ఇప్పటి టైం లైన్ లోనే సాగుతుంది. సాధారణంగా ఇంటర్నెట్ పుణ్యమా అని ఒక సెలబ్రిటీ ఉంటే, వారి తల్లిదండ్రులు ఎవరు? వారి పిల్లలు ఎవరు? వాళ్ళు ఎక్కడ ఉంటారు? ఇలాంటి విషయాలు అన్ని చాలా సులభంగా తెలిసిపోతాయి. ఎక్కడో ఒక్క ఫోటో అయినా బయటికి వచ్చే ఉంటుంది. అలాంటిది, తెలంగాణ చీఫ్ మినిస్టర్ కూతురు ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదా? అది అసలు ఈ కాలంలో సాధ్యం అవుతుందా?
#2 సినిమా మొత్తం గాలిలో తీశారా? లేదా మనుషులు మాట్లాడుతూ ఉంటే వాళ్ళు మాటలతో పాటు గాలి కూడా వస్తుందా? ఏదైనా ఒక పాత్ర సినిమాలో గట్టిగా మాట్లాడగానే మిగిలిన పాత్రల అందరి మీదకి గాలి ఎందుకు వెళ్తుంది? అంతే కాకుండా హీరో ఒక వ్యక్తిని కొడితే, ఆ వ్యక్తి ఇంకొక పోలీస్ తో ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. హీరో కొట్టిన దెబ్బలకి అవతల వైపు ఫోన్ మాట్లాడుతున్న పోలీసు ఫోన్ లో నుండి గాలి వస్తుంది. వాళ్లు భయపడ్డారు అంటే బానే ఉంది. కానీ అదేదో వాళ్ళ మొహాల మీద ఫ్యాన్ వేసి భయపెట్టడం దేనికి?
#3 సినిమాలో ఇంకొక హీరోయిన్ అమ్ముని తల మీద కొడతారు. చాలా వరకు అమ్ము ట్రీట్మెంట్ లోనే ఉన్నట్టు చూపిస్తారు. కానీ ట్రీట్మెంట్ మొదలు పెట్టిన అప్పటి నుండి చివరి వరకు ఒక్క సారి కూడా అమ్ము జుట్టు తీసి వైద్యం చేసినట్టు చూపించలేదు. జుట్టు మీద ట్రీట్మెంట్ ఎలా చేశారు?
#4 హీరో ఊరు నుండి వచ్చిన ఒక సాధారణమైన మనిషి. కరాటే లాంటి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నట్టు ఎక్కడ చూపించలేదు. కానీ ముఖ్యమంత్రి ఇంటికి వచ్చి అక్కడ ఉన్న ఇద్దరు ముఖ్యమంత్రుల ఇద్దరమ్మాయిలని తీసుకొని చాలా ఈజీగా వెళ్ళిపోతాడు. అతనిని అడ్డుకోడానికి వచ్చిన వాళ్ళని ఇంకా ఈజీగా కొడతాడు.
ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇంటలిజెన్స్ బ్యూరో నుండి వచ్చిన వ్యక్తి ఒక పక్క మరొక రామ్ పోతినేని ఒక దొంగ అని చెప్తూనే, మరొక పక్క ఎలివేషన్లు ఇస్తూ ఉంటాడు. వీళ్ళు ఉన్నది వాళ్లు చేసిన తప్పుల గురించి చెప్పడానికా? లేకపోతే, “వాడు కొడితే దెబ్బ అదిరిపోతుంది” అని ఎలివేషన్లు ఇవ్వడానికా?
#5 జనరేషన్లు మారుతున్నాయి. కొత్త కొత్త దర్శకులు వస్తున్నారు. కానీ హీరోయిన్ ని చూపించే విధానం మాత్రం ఎప్పటికీ మారదు. ఒక పక్క కిడ్నాప్ చేసుకొచ్చి ఊరు కాని ఊరులో పెడితే, కొంచెం కూడా టెన్షన్ లేకుండా రెండు రోజుల తర్వాత వచ్చి, “నాకు బోర్ కొడుతోంది. డాన్స్ చేద్దాం” అని అడుగుతుంది. అప్పుడు మళ్ళీ ఒక పాట.
“వాడంటే నాకు అసహ్యం” అని రోజంతా హీరోని తిడుతూనే ఉంటుంది. కానీ హీరో పార్టీలో కనిపించి, “దా నాతో డాన్స్ చెయ్, ఫ్రస్టేషన్ పోగొడతా” అనగానే హీరో డాన్స్ ని మ్యాచ్ చేస్తూ డాన్స్ వేస్తుంది. మళ్లీ పాట తర్వాత హీరోని తిడుతుంది. అసలు హీరోయిన్ పాత్ర ఇలా ఎందుకు రాశారు?
ఇవి మాత్రమే కాదు. కరెక్ట్ గా సినిమా చూస్తే ఇలాంటివి చాలా డౌట్లు వస్తాయి.
ALSO READ : జబర్దస్త్ కి కొత్త యాంకర్…ఎవరో తెలుసా…!
End of Article