ఈటీవీ లో ప్రసారమయ్యే బుల్లితెర కామెడీ షో జబర్దస్త్ రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగా ఫేమస్. గురు శుక్రవారాల్లో జబర్దస్త్ వస్తుందంటే చాలు కుటుంబం మొత్తం టీవీలకు అతుక్కుపోతూ ఉంటుంది. జబర్దస్త్ ప్రారంభమైనప్పటి నుండి ఈ షో మంచి రేటింగ్ తో కొనసాగుతూ ఉంది. షో కోస్తున్న పాపులారిటీని చూసి జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ గా విడదీసి ఇద్దరి యాంకర్లను పెట్టి షోను నడిపించి ఉన్నారు. యాంకర్ లు గా అనసూయ తర్వాత వచ్చిన రష్మీ తమ గ్లామర్ తో షోకి మంచి క్రేజ్ తీసుకువచ్చారు.

Video Advertisement

మొదట లో జడ్జిలుగా ఉన్న నాగబాబు, రోజాలు కూడా జబర్దస్త్ కి మంచి పాపులారిటీని తీసుకువచ్చారు. జబర్దస్త్ లో పనిచేసిన టీం లీడర్లు అందరూ ఇప్పుడు సినిమాల్లో బిజీ కమెడియన్లు అయిపోయారు. జబర్దస్త్ పుణ్యమా అంటూ ఎందరో కమెడియన్లు తెలుగు తెరకి పరిచయం అయ్యారు. జబర్దస్త్ ప్రోగ్రాం ఎందరికో లైఫ్ ని కూడా ఇచ్చింది.

jabardasth judges remunaration

జబర్దస్త్ ను పోలి మిగతా ఛానల్ లో ఎన్నో కామెడీ షో లు వచ్చినా కూడా అవి నిలబడలేకపోయాయి.
అయితే జబర్దస్త్ లో యాంకరింగ్ కి అనసూయ బ్రేక్ ఇచ్చిన తర్వాత ఆమె స్థానంలో సౌమ్యరావు ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు జబర్దస్త్ కి సౌమ్య రావు కూడా గుడ్ బై చెప్పినట్లు వినపడుతుంది. ఇప్పుడు ఆమె స్థానంలోకి బిగ్ బాస్ బ్యూటీ ని తీసుకువస్తున్నారు. ఇంతకీ ఎవరా ఆ బ్యూటీ అనుకుంటున్నారా…!

Bigg Boss 5 Contestant Siri Hanumanth Images,

ప్రముఖ యూట్యూబర్ సిరి హనుమంత్. ఈమె ముందు యూట్యూబ్ లో బాగా ఫేమస్ అయ్యారు. తర్వాత బిగ్ బాస్ కి వెళ్లి అక్కడ కూడా మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. ఇప్పుడు ఈ భామ జబర్దస్త్ లో యాంకరింగ్ చేస్తుంది. తాజాగా విడుదలైన ప్రోమో గమనిస్తే సిరి హనుమంత్ ఈ షోకు యాంకర్ గా చేస్తున్నట్లు కనిపించింది. ఇందులో జడ్జిలుగా ఉన్న ఇంద్రజ, కృష్ణ భగవాన్ లు కూడా ఆమెకు స్వాగతం పలికారు. ఇక ఎప్పటిలాగానే షోలో నవ్వుల పంచే కామెడీ స్కిట్లు ఈవారం టెలికాస్ట్ కానున్నాయి.అనసూయ కి రష్మికి వచ్చిన క్రేజ్ బిగ్ బాస్ ద్వారా సిరి హనుమంత్ కూడా వస్తుందేమో చూడాలి.

Also Read:మాటల మాంత్రికుడు “త్రివిక్రమ్ శ్రీనివాస్” చెప్పిన 8 జీవిత సత్యాలు..!