Ads
ఈ సమాజం లో మహిళలకు ఎక్కువ కష్టాలున్నాయన్న సంగతి కొంతమేర ఒప్పుకోవాల్సిన విషయమే. ఈ సమాజం పెట్టిన కట్టుబాట్లు కావచ్చు, సంప్రదాయాల పేరిట వారిపై రుద్దబడుతున్న నియమాలు కావచ్చు.. ఇవన్నీ మహిళలు ఓర్చుకుని తమ జీవిత లక్ష్యాలను సాధించుకోవాలి. ఉదాహరణకి ఈ కింద ఇవ్వబడిన ఫోటో ను నిశితం గా గమనించండి.
Video Advertisement

image credits: twitter/unwomen_pak
మొదట చూడగానే, మీకేమనిపిస్తుంది. పెళ్లి కూతురు లా ఉన్న ఓ అమ్మాయి కన్నీళ్లు పెడుతోంది. ఈ ఫోటో చూడగానే మీ మనసులో రకరకాల భావాలు కలుగుతూ ఉండవచ్చు. అయితే, ఆ తరువాత ఫోటోలను వరుస గా చూస్తూ వెళితే మీకు ఓ విషయం బోధ పడుతుంది.

image credits: twitter/unwomen_pak
పై ఫోటో చూడగానే, ఆమె ఏదో బరువుని లాగుతున్నట్లు కనిపిస్తోంది కదా. సరిగ్గా గమనిస్తే.. ఎద్దుల బండి లాంటి బండి పైన కొన్ని బరువైన వస్తువులు ఉన్నాయి. వాటిని పెళ్లి కూతురు వస్త్రాలలో ఉన్న ఆమె బలవంతం గా లాగుతూ ముందుకు వెళుతోంది.. ఇంకొక ఫోటో ను చూడండి..

image credits: twitter/unwomen_pak
ఆ బండి పైన పెళ్లి కొడుకు కూడా నుంచుని ఉన్నాడు. బహుశా ఆమె భర్త అయి ఉంటాడు. ఆమె అంత బరువుని మోస్తుంటే.. అతను ఆమె పై మరింత భారం మోపుతున్నాడు.

image credits: twitter/unwomen_pak
చివరిగా, ఈ ఫోటో ను చూసాక.. ఇంకా నేను ఏమి చెప్పక్కర్లేదు అనుకుంట. కట్నం పేరిట పెళ్లి కూతురుపై చాలా భారం పడుతుంది. ఈ ఫోటోలు స్క్రోల్ చేస్తున్న కొద్దీ మనలో భావోద్వేగం పెరుగుతుంటుంది. ఇండియన్ సొసైటీ లో కట్నం అనేది ఓ సంప్రదాయం అయిపొయింది. ఒక రకం గా చెప్పాలంటే ఈ సమాజం సంప్రదాయం పేరిట.. ఆడ పెళ్లి వారి కుటుంబం పై మోతబరువును వేస్తోంది. మరో మాట గా చెప్పాలంటే, ఆడ పిల్లల తల్లి తండ్రులు ఓ అబ్బాయి కి తమ కూతురిని ఇవ్వడమే కాకుండా, తమ జీవిత సంపాదనను కూడా ధారపోస్తున్నారు. దీనిని మీరు అంగీకరిస్తారా..?
End of Article