డాక్టర్ అంబెడ్కర్ రెండవ పెళ్లి స్టోరీ ఏంటో తెలుసా..? “ప్రియమైన శారూ.. ప్రేమతో నీ రాజా…”!

డాక్టర్ అంబెడ్కర్ రెండవ పెళ్లి స్టోరీ ఏంటో తెలుసా..? “ప్రియమైన శారూ.. ప్రేమతో నీ రాజా…”!

by Anudeep

అంబెడ్కర్.. ఎవరికీ పరిచయం అవసరం లేని పేరు. ఆయన భారతీయ న్యాయవాది, రాజకీయ నేత, ఆర్థిక శాస్త్రవేత్త. ఆయన కులాన్ని నిర్ములించడానికి ఎంతగానో కృషి చేశారన్న సంగతి తెలిసిందే. అయితే.. చాలా మందికి ఆయన వ్యక్తిగత జీవితం గురించి తెలియదు. ఈ ఆర్టికల్ లో డాక్టర్ అంబెడ్కర్ గారి రెండవ పెళ్లి స్టోరీని తెలుసుకుందాం. బిబిసి కధనం ప్రకారం.. ముంబైలోని వైల్ పార్లే ప్రాంతంలో నివసించే డాక్టర్ ఎస్. రావు అంబెడ్కర్ కు అత్యంత సన్నిహితుడు. అంబెడ్కర్ ముంబై వెళ్ళినప్పుడల్లా ఆయనను కలుస్తూ ఉండేవారు.

Video Advertisement

డాక్టర్ ఎస్. రావు కు ఉన్న కూతుర్లకు శారద అనే ఓ స్నేహితురాలు ఉండేవారు. వారిది కబీర్ కుటుంబం. కబీర్ కుటుంబానికి, డాక్టర్ ఎస్. రావు కుటుంబానికి సన్నిహిత సంబంధాలు ఉండేవి. రెండు కుటుంబాల మధ్య రాకపోకలు కూడా ఉండేవి. ఈ క్రమంలోనే శారద కబీర్ కు అంబెడ్కర్ తో పరిచయం ఏర్పడింది. శారద కబీర్ తండ్రి కృష్ణారావు వినాయక్‌రావు కబీర్ కు శారదతో కలిపి ఎనిమిది మంది సంతానం ఉన్నారు. అంబెడ్కర్ కార్మిక మంత్రిగా ఉన్నప్పుడే శారద పరిచయం అయ్యారు.

శారద తన కూతురి స్నేహితురాలిని, తెలివైన అమ్మాయని, ఎంబిబిఎస్ చదివిన డాక్టర్ అని డా.ఎస్ రావు పేర్కొన్నారు. ఆమె పేరు శారు అయినా పెళ్లి అయిన తరువాత మాత్రం ఆమె తన పేరుని సవిత అంబెడ్కర్ గా మార్చుకున్నారు. డాక్టర్ మాల్యాంకర్ వద్ద ఆమె సహాయక డాక్టర్ గా పని చేసేవారు. మరో వైపు.. అంబెడ్కర్ తన అనారోగ్యాల కారణంగా మాల్యాంకర్ క్లినిక్ ను సందర్శిస్తూ ఉండేవారు. మాల్యాంకర్ క్లినిక్ ను సందర్శించాల్సిందిగా అంబెడ్కర్ కు డా.ఎస్ రావు సిఫారసు చేస్తారు.

ambedkar 2

ఈ క్రమంలో మాల్యాంకర్ క్లినిక్ వద్ద అంబెడ్కర్ కు శారదాతో పరిచయం మరింత ముందుకు సాగింది. అంబెడ్కర్ అణగారిన వర్గాల కోసం తన గొంతుని వినిపిస్తూ.. తన ఆరోగ్యం గురించి పట్టించుకోలేదు. దీనితో తరచూ అనారోగ్యం బారిన పడుతూ ఉండేవారు.. అంబెడ్కర్ ను పరిశీలించిన మాల్యాంకర్ ఆయనకు బీపీ, మధుమేహం, కీళ్లనొప్పులు, తిమ్మిర్లు ఉన్నట్లు గుర్తించారు. అప్పటికి అంబెడ్కర్ కు వివాహం అయింది. ఆయన మొదటి భార్య రమాబాయి. కానీ, ఆమె 1935 లోనే మరణించారు. అప్పటి నుంచే అంబెడ్కర్ ఒంటరిగానే ఉన్నారు.

ambedkar 3

ఆ తరువాత తన అనారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని.. తాను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని భావించి.. తన జీవితానికో తోడు ఉంటె బాగుండని అనుకున్నారు. ఆ తోడు శారద అయితే బాగుంటుందనుకున్నారు. అందుకే ఆయన శారదకు ఈ విషయాన్నీ ప్రస్తావించారు. ఆమెకు ఓ ప్రేమ లేఖను కూడా పంపించారు.. ఈ ప్రేమ లేఖను “ప్రియమైన శారూ అని ప్రారంభించి.. ప్రేమతో నీ రాజా..” అని ముగించారు. నాతొ పాటు ఓ సహచరి ఉండాలని నన్ను అభిమానించే జనం.. నా సన్నిహితులు అంటూ ఉంటారు. నాకు నచ్చే, నాతో ఉండగలిగే మహిళా దొరకడం కష్టం.

ambedkar 4

అది నువ్వు అయితే బాగుంటుందని అనుకుంటున్నా.. మనిద్దరి మధ్య ఉన్న వయసు వ్యత్యాసాన్ని, నా అనారోగ్య సమస్యలని దృష్టిలో ఉంచుకుని నన్ను కాదన్నా.. నేను చింతించను..” అని అంబెడ్కర్ ప్రేమ లేఖలో రాసారు. అయితే.. శారద మొదట ఆశ్చర్యపోయినా డాక్టర్ మాల్యాంకర్ ను, తన సోదరుడిని అడిగి చివరకు అంబెడ్కర్ ను పెళ్లి చేసుకోవడానికే నిశ్చయించుకున్నారు. శారద తన అంగీకారం తెలిపిన తరువాత అంబెడ్కర్ ఆమెకోసం ఓ బంగారు నెక్లెస్ ను కూడా బహుకరించారు. వీరు మొదట ముంబై లోనే పెళ్లి చేసుకోవాలని అనుకున్నా.. అనుకోని కారణాల వలన వీరి పెళ్లి ఢిల్లీ లో కొనసాగింది. వీరి విశేషాలను మాయి సాహెబ్ తన ఆత్మకథ అయిన “డాక్టర్ అంబేడ్కరాంచ్య సాహావాసాత్” (అంబెడ్కర్ తో నా జీవితం) లో రాసుకున్నారు.


You may also like