ఏవైనా సినిమాలు బాగుంటే వాటిని డబ్బింగ్ చేస్తూ ఉంటారు. తమిళ సినిమాలని కానీ హిందీ సినిమాలను కానీ మలయాళ సినిమాలు కానీ మన తెలుగు లోకి డబ్బింగ్ చేయడం ఎక్కువగా మనం చూస్తూ ఉంటాము. అలానే తమిళ సినిమా అయినటువంటి ‘తేరి’ సినిమాని తెలుగు లోకి పోలీసోడు కింద డబ్ చేసిన సంగతి తెలిసిందే.

Video Advertisement

2016లో ఈ సినిమా విడుదల అయింది. ఇది ఒక మంచి యాక్షన్ థ్రిల్లర్ సినిమా. ఈ సినిమా ని 75 కోట్ల బడ్జెట్ తో తీశారు. అట్లీ కుమార్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు.

ఈ సినిమా నిర్మాత కలయిపులి. ఈ సినిమాలో విజయ్, సమంత, అమీ జాక్సన్ ముఖ్య పాత్రలను పోషించిన విషయం తెలిసిందే. ఈ సినిమా కి మ్యూజిక్ జీవి ప్రకాష్ కుమార్ అందించారు. ఈ సినిమాని తెలుగులో పోలీసోడు కింద డబ్ చేసిన సంగతి అందరికీ తెలిసినదే. డిసిపి విజయ్ కుమార్ తన కూతురిని సురక్షితంగా ఉంచేందుకు తీసుకు వస్తారు.

భయంకరమైన గ్యాంగ్స్టర్స్ వలన ఆమె కి ప్రమాదం ఉంటుంది ఎలా అయినా తన కూతుర్ని కాపాడుకోవడానికి చూస్తాడు. ఇలా కథ నడుస్తుంది. ఇలా ఈ తమిళ సినిమాని తెలుగులోకి తీసుకు వచ్చారు. అయితే మళ్లీ ఈ సినిమాకి రీమేక్ వస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. పోలీసోడు సినిమాకి రీమేక్ ని హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో తీసుకు వస్తారట. ప్రాజెక్టు ఓకే అయితే రీమేక్ వస్తుందని అంటున్నారు. తెలుగులోకి డబ్ చేసి మళ్లీ రీమేక్ చేస్తున్నారా అంటూ ట్విట్టర్ యూజర్లు అడుగుతున్నారు.