Ads
మలయాళం సినిమాలు తెలుగులోకి డబ్బింగ్ అవడం సహజమే. ఇటీవల అలా మలయాళంలో సూపర్ హిట్ అయ్యి, తెలుగులోకి డబ్ అయ్యి ఇక్కడ కూడా సూపర్ హిట్ అయిన సినిమా ప్రేమలు. హైదరాబాద్ కి వచ్చిన యువతీ యువకుల మధ్య ఈ కథ నడుస్తుంది. చిన్న కథని చాలా బాగా చూపించారు. ముఖ్యంగా యూత్ కి చాలా కనెక్ట్ అయ్యే కథ ఇది. ఈ సినిమాకి రెండవ భాగం కూడా ఉంటుంది అని ఇటీవల ప్రకటించారు. అయితే ప్రేమలు సినిమాలో హీరో పాత్ర సినిమాకి హైలైట్ గా నిలిచింది. హీరో పోషించిన సచిన్ పాత్ర, అతను మాట్లాడే డైలాగ్స్ చాలా కామెడీగా అనిపించాయి.
Video Advertisement
సచిన్ పాత్రకి తెలుగులో డబ్బింగ్ చెప్పిన వ్యక్తికి క్రెడిట్ ఇవ్వాల్సిందే. ఆ వ్యక్తి పేరు దుర్గా అభిషేక్. సినిమా చూస్తున్నంత సేపు కూడా ఇది డబ్బింగ్ సినిమాని గుర్తు రాకుండా సచిన్ పాత్రకి దుర్గా అభిషేక్ చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియోని కూడా దుర్గా అభిషేక్ తన సోషల్ మీడియా అకౌంట్స్ లో షేర్ చేశారు. ఈ పాత్ర ప్రేక్షకులకు ఇంత చేరు అవ్వడానికి డబ్బింగ్ చాలా ముఖ్య కారణం. దుర్గా అభిషేక్ ఇప్పటి వరకు దాదాపు 300 పైన ప్రాజెక్ట్స్ కి డబ్బింగ్ చెప్పారు. ప్రేమలు సినిమా దుర్గా అభిషేక్ కి చాలా మంచి పేరు తీసుకొచ్చింది.
అయితే ప్రేమలు హీరో నాస్లెన్ కె. గఫూర్ నటించిన నైమర్ అనే సినిమా కూడా తెలుగులో డబ్ అయ్యి ఓటీటీలో విడుదల అయ్యింది. ఈ సినిమాలో కూడా నాస్లెన్ కె. గఫూర్ పాత్రకి దుర్గా అభిషేక్ డబ్బింగ్ చెప్పినట్టు ఆ సినిమా చూస్తే తెలుస్తోంది. దుర్గా అభిషేక్ నటుడు కూడా. ప్రేమలు సినిమా డబ్బింగ్ వీడియో దుర్గా అభిషేక్ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఇది చూసిన వాళ్ళు దుర్గా అభిషేక్ హీరో పాత్రకి డబ్బింగ్ చెప్పడం కోసం ఎంత కష్టపడ్డారు అనేది అర్థం చేసుకుంటున్నారు. ప్రేమలు హీరో పాత్ర మనకి అంత కనెక్ట్ అవ్వడానికి కారణం తన డబ్బింగ్ అంటూ అభినందిస్తున్నారు.
watch video :
ALSO READ : రాఖీ లో అంత మంచి పాత్రలో నటించిన తర్వాత కూడా మంజూష సినిమాలకు ఎందుకు దూరంగా ఉన్నారు..? కారణం ఇదేనా..?
End of Article