తమిళ్ డైలాగ్స్ కి తెలుగు నేటివిటీ టచ్ ఇచ్చి హిట్ కొట్టిన రచయితలు..

తమిళ్ డైలాగ్స్ కి తెలుగు నేటివిటీ టచ్ ఇచ్చి హిట్ కొట్టిన రచయితలు..

by Mounika Singaluri

Ads

సినీ ఇండస్ట్రీలో డబ్బింగ్ చిత్రాలకు కొదవలేదు. వేరే భాషలో హిట్ అయిన మూవీస్ ని తెలుగులో కొన్నిసార్లు డబ్ చేస్తే మరికొన్నిసార్లు రీమేక్ కూడా చేస్తారు. ఇలా మన ముందుకు వచ్చిన ఎన్నో చిత్రాలలో డైలాగ్స్ విషయంలో గమనిస్తే నేటివిటీ ఏమాత్రం చెదరకుండా బాగా కన్వర్ట్ చేసి ఉంటారు. అలాంటి కొన్ని డైలాగ్స్ ఈరోజు చూద్దాం.కోలీవుడ్ మూవీ రైటర్ జయమోహన్ సోట్ఱు కణక్ రాసిన ఒక స్టోరీ చాలా హిట్ అయింది దీంతో దీన్ని..కూటి రుణం అనే పేరుతో అవినేని భాస్కర్ తెలుగులోకి డబ్ చేశారు.

Video Advertisement

ఆ స్టోరీలో ఒక సందర్భంలో..ఏటొడ్డున పెరిగే పొన్నగంటి ఆకే నాకు ఊహ తెలిసినప్పట్నుండి మేం రోజూ తిన్నది”అనే ఒక డైలాగ్ ఉంది.. అయితే తెలుగువారు పొన్నగంటి కూర తిన్నప్పటికీ మరీ అంత ఎక్కువగా తినరు.. కానీ అది ఏడాది పొడుగునా దొరుకుతుంది. పైగా డబ్బు పెట్టి కొనకుండా ఏటిగట్టున పండేదాన్ని కోసుకొని తిన్నాము అని వచ్చే అర్థం.. వేరే ఆకుకూర గురించి రాస్తే మారిపోతుంది కాబట్టి దాన్ని అలాగే ఉంచేశారు. ఇలా ట్రాన్స్లేట్ చేసే సమయంలో నేటివిటీకి భగ్నం కలగకుండా.. కథలోని ఇంటెన్సిటీ మారకుండా జాగ్రత్త వహించడం ఎంతో అవసరం.

అలాగే భారతీరాజా డైరెక్షన్లో వచ్చిన ముదల్ మరియాదై అనే తమిళ్ చిత్రం తెలుగులో ఆత్మబంధువుగా డబ్ చేయబడింది. ఇందులో ఒక సన్నివేశంలో బోటు నడిపే కుటుంబాన్ని ఉద్దేశించి శివాజీ గణేషన్..ఊరోళ్ల దగ్గర కంబో, వరహో తీసుకుని పడవ నడపండి అని తమిళ్ లో ఒక డైలాగ్ చెబుతాడు.కంబు, వరహు అనే తమిళ్లో ఆహార ధాన్యాలను పిలుస్తారు. దీన్ని తెలుగు నేటివిటీకి తగినట్టుగా కేవు అని మార్చారు..అంటే “ఊరోళ్ల దగ్గర సరైన కేవు తీసుకుని పడవ నడపండి” అనేది తెలుగు డైలాగ్. కేవు అంటే పడవ నడపడానికి ఇచ్చే కూలి అని తెలుగులో అర్థం.


End of Article

You may also like