వెరైటీ వెడ్డింగ్ కార్డు…ఈ కొత్త జంట ఐడియాకి అందరు ఫిదా.! ఆ కార్డులో అంత స్పెషల్ ఏంటంటే.?

వెరైటీ వెడ్డింగ్ కార్డు…ఈ కొత్త జంట ఐడియాకి అందరు ఫిదా.! ఆ కార్డులో అంత స్పెషల్ ఏంటంటే.?

by Mohana Priya

Ads

ప్రస్తుతం మన చుట్టూ ఉన్న పరిసరాలను చూస్తే మనం వాడే చాలా వస్తువులు, చేసే చాలా పనులు ప్రకృతికి హాని కలిగించేలా ఉంటాయి. అందుకే చాలా మంది ఎన్విరాన్మెంట్ ని కాపాడడానికి తమ వంతు కృషిగా ప్లాస్టిక్ వస్తువులను అవాయిడ్ చేయడం, ఈకో ఫ్రెండ్లీ వస్తువులని వాడటం, చుట్టూ మొక్కలు పెంచడం వంటివి చేస్తున్నారు.

Video Advertisement

కానీ ఇటీవల ఒక వ్యక్తి ఏకంగా ఈకో ఫ్రెండ్లీ వెడ్డింగ్ కార్డ్ లను తయారు చేయించారు. ఆ వెడ్డింగ్ కార్డ్ లో విత్తనాలు ఉన్నాయి. వెడ్డింగ్ కార్డ్ ని నీటిలో తడిపి, తర్వాత మట్టిలో పెడితే అందులో ఉన్న విత్తనాలు మొలకెత్తుతాయి. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ కి చెందిన శశికాంత్ కొర్రవత్, ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ ఆఫీసర్ గా ఉద్యోగం చేస్తున్నారు.

నవంబర్ 28 వ తేదీన శశికాంత్ పెళ్లి. తన పెళ్ళికి ఈ విధంగా వెడ్డింగ్ కార్డ్ డిజైన్ చేయించుకున్నారు. ఆగ్రా కి చెందిన ఒక స్టార్టప్ కంపెనీ ఈ వెడ్డింగ్ కార్డ్ లను తయారుచేసింది. దీనిపై శశికాంత్ మాట్లాడుతూ “నా జీవితంలో అత్యంత ముఖ్యమైన రోజు ఎన్విరాన్మెంట్ కి ఎంతో కొంత మంచి చేయాలి అనే ఉద్దేశంతో ఈ విధంగా వెడ్డింగ్ కార్డ్స్ తయారు చేయించానని” చెప్పారు.

ఈ వెడ్డింగ్ కార్డ్ ని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ కి ఇచ్చి తన పెళ్లికి ఇన్వైట్ చేశారు శశికాంత్ . వెడ్డింగ్ కార్డ్ లో చామంతి, బంతి, లిల్లీ, పచ్చిమిర్చి, టొమాటో, బెండ విత్తనాలు ఉన్నాయి.


End of Article

You may also like