Ads
తమిళ్ స్టార్ విజయ్ కి తెలుగులో చాలా క్రేజ్ ఉంది. తెలుగులో విజయ్ సినిమాలు చేయకపోయినా కూడా చాలా గుర్తింపు ఉన్న హీరో అయ్యారు. తమిళ ఇండస్ట్రీలో అత్యధిక మార్కెట్ తో కొనసాగుతున్న విజయ్ ఇప్పుడు వారసుడు సినిమాతో కూడా ఊహించని స్థాయిలో బిజినెస్ క్రియేట్ చేశాడు. అయితే తెలుగులో విజయ్ కి మంచి మార్కెట్ ఉన్నా సరే అతడు ఎప్పుడూ ఇక్కడి ప్రేక్షకులతో కలిసేందుకు ప్రయత్నించలేదు.
Video Advertisement
అందుకే విజయ్ పై ఇక్కడ ట్రోల్స్ కూడా ఎక్కువగా వస్తూనే ఉంటాయి. ఈ విషయం పై తెలుగు, తమిళ ప్రేక్షకులకి కొన్ని సార్లు ఫ్యాన్ వార్స్ కూడా అయ్యాయి. విజయ్ డైరెక్ట్ గా ఎటువంటి పొరపాటు చెయ్యకపోయినా.. ఆయన ఎక్కువగా ట్రోల్స్ బారిన పడుతూనే ఉన్నారు. అయితే తాజాగా ఒక ట్రోల్ వీడియో ఒకటి వైరల్ గా మారింది.
ఒక మూవీ లో విజయ్ ఒక కొండ పై నుంచి వాటర్ లోకి దూకే సీన్ ని లిరిల్ యాడ్ సాంగ్ కి జత చేసి విజయ్ ఆ సోప్ కి యాడ్ ఇస్తున్నట్లు ఆ వీడియో ని క్రియేట్ చేసారు. ఈ వీడియోని చూసిన నెటిజన్లు పలు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఇదే కాకుండా ఇటీవల రిలీజ్ అయిన విజయ్ మూవీ వారసుడు పై కూడా ఫాన్స్ చాలా ట్రోల్స్ చేసారు. ఇటు అటు పాత కథలని మార్చి ఈ సినిమా ని తీసుకు వచ్చినట్టుంది ట్రోల్స్ చేసారు.
ఇవే కాకుండా విజయ్ గతం లో తెలుగులో సూపర్ హిట్ అయిన చిత్రాలు చాలా వాటిని తమిళ్ లో రీమేక్ చేసారు. అప్పట్లో సోషల్ మీడియా లేకపోవడం.. అంతే కాకుండా అప్పట్లో విజయ్ తెలుగు వారికీ తెలియకపోవటం వల్ల ఆ సినిమాల గురించి తెలుగు ప్రేక్షకులకి తెలీదు. ఇప్పుడు తాజాగా ఇటువంటి ఫ్యాన్ వార్స్ జరుగుతుండటం వల్ల.. ఆ పాత సినిమాల్లోని పలు సీన్లను ఇప్పుడు బయటకి తీస్తూ విజయ్ పై ట్రోల్స్ వర్షం కురిపిస్తున్నారు.
watch video :
https://www.instagram.com/reel/CoXT1A5J3as/?igshid=YmMyMTA2M2Y%3D
End of Article