Ads
దేశం ఎంత అభివృద్ధి చెందుతూ పోతున్నా.. అమ్మాయిలకి మాత్రం ఈ దేశం లో రక్షణ లేదు. గడపదాటి బయటకి వస్తే, తిరిగి ఇంటికి వచ్చే వరకు వారిపైన ఎన్నో కళ్ళు ఉంటాయి. వారి ఇంటికి వెళ్లెవరకూ అనుక్షణం భయపడుతూనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Video Advertisement
ఆఫీస్ నుంచి ఇంటికి వస్తూ.. క్యాబ్ డ్రైవర్ చేతిలో దారుణానికి బలి అయిన ఓ అమ్మాయి తనకు జరిగిన అన్యాయం పై ఆక్రోదన చెంది రాసిన లేఖ ఇది..
representative image
ఆఫీస్ లో లాగ్ అవుట్ చేసి బయటకు వచ్చేసరికి రాత్రి పది అయ్యింది. బి షిఫ్ట్ వేయడం తో రాత్రి పది వరకు పని చేయాల్సి వచ్చింది. డ్యూటీ అయ్యాక బయటకు వచ్చి ఓ క్యాబ్ ను ఆపి ఇంటికి బయలుదేరాను. ఆ టైం లో క్యాబ్ దొరకడమే అదృష్టం అనుకున్న నాకు జరగబోయే దుర్ఘటన గురించి తలంపు రాలేదు. వెదర్ బాగుంది..పక్కనే ఉన్న టీ స్టాల్ ఓ టీ తాగుతాను అని క్యాబ్ డ్రైవర్ అడిగితె.. నాకు ఏమి అనుమానం రాలేదు. కొంత సేపు అయ్యాక రోడ్డు పై ఎక్కడా జనసంచారం లేకపోవడం తో డ్రైవర్ నా పై కన్ను వేసాడని అర్ధం అయింది.
representative image
తప్పించుకోవడానికి దారి వెతుక్కునే లోపే వాడు కారు ఆపి వెనక్కి వచ్చి కబంధ హాస్టల్లో బంధించాడు. అంత క్షణం లో జరిగిపోయింది. తప్పించుకోవడం నావల్ల కాలేదు. ఎంత బతిమిలాడినా ఆ రాక్షసుడు నాలో ఓ అమ్మనో, చెల్లినో చూడలేకపోయాడు. అన్నా అని పిలుస్తూ ఎంతో బతిమిలాడినా అతను కనికరించలేదు. అతని వాంఛ కి నా శరీరం పచ్చిపుండైంది. ఒళ్ళంతా అసహ్యమైన భావన కలగసాగింది.
representative image
#. ప్రతి తల్లికి ఉండే పాలిండ్లను సిగరెట్లు గుచ్చుతూ హింసించే వాడు గా తన కొడుకు మారతాడని తెలిస్తే.. ఏ తల్లి బిడ్డకు పాలివ్వదేమో అని ఆక్షణం నాకు అనిపించింది..
#. పరస్త్రీ పై ఇలా తన కొడుకు పంజా విసురుతాడని తెలిస్తే.. ఆ తల్లి చిన్నప్పుడే ఇంత విషం ఇచ్చి చంపేసేదేమో..
#. పులి జింకను వేటాడినట్లు ఈ గోళ్ళతో మరో ఆడదాని శరీరం పై గుచ్చుతాడని తెలిస్తే.. ఏ తల్లి అయినా తన కొడుకు వేళ్ళను పట్టకారు తో పట్టి పీకేసేది ఏమో..
representative image
#. “కుక్కలాగా మీద పడి మరో ఆడదాని మూతులు నాకేవాడు అని తెలిస్తే.. ఏ తల్లి అయినా తన కొడుకు మూతి మీద వాతపెట్టేదేమో.
#. బలవంతం గా మరో స్త్రీ పై ఆక్రమణ చేస్తాడని ముందే తెలిస్తే.. ఏ తల్లి అయినా ఇలాంటి కొడుకుల్ని ఉయ్యాలా లో వేసిన సమయం లోనే కిందకు తోసేసి పీడా విరగడ అయిందని భావించేదేమో..
representative image
#. జన్మస్థలాన్ని కేవలం కామం తోనే చూసేవాడిని తెలిస్తే.. ఇలాంటి వాళ్ళ తల్లి తన కొడుకుని అబార్షన్ పేరిట బయటకే రానివ్వకుండా చేసేదేమో..
#ఇలాంటి దౌర్భాగ్యపు పనులు చేసే కొడుకులను ముందే చంపేసి.. రేపటి రాక్షసుడ్ని చంపేశానంటూ ఆ తల్లి సంబరాలు చేసుకునేదేమో..
featured image: a screenshot from Aa gang repu short film
End of Article