గొప్ప సైంటిస్ట్ గా ఐన్ స్టీన్ అందరికి తెలుసు…కానీ ఆయన భార్యకి పెట్టిన ఈ షరతులు తెలుసా.?

గొప్ప సైంటిస్ట్ గా ఐన్ స్టీన్ అందరికి తెలుసు…కానీ ఆయన భార్యకి పెట్టిన ఈ షరతులు తెలుసా.?

by Anudeep

Ads

మనలో ఆల్బర్ట్ ఐన్ స్టీన్ పేరు తెలీని వ్యక్తులు ఉండకపోవచ్చు. ఎందుకంటే మన స్కూల్ పుస్తకాల నుంచే ఆయన గురించి చదువుతూ వస్తాము. ఆయన కనిపెట్టిన అంశాలు, ప్రతిపాదించిన సూత్రాలు నేటికీ ఉపయోగించబడుతూ ఉన్నాయి. ఎందరో శాస్త్రవేత్తలు ఆయన ప్రతిపాదించిన సూత్రాలను అనుసరించే పరిశోధనలు చేస్తున్నారు. ఆయన ఐక్యూ గురించి కూడా పలు విశేషాలు చెబుతుంటారు. సాధారణ మనుషుల ఐక్యూ కంటే..ఐన్ స్టీన్ ఐక్యూ ఎక్కువ అని చెప్తూ ఉంటారు. అయితే, ఇంతటి గొప్ప వ్యక్తి గురించి మీకు తెలియని కొన్ని విశేషాల గురించి చెప్పుకుందాం.

Video Advertisement

ainstein wife img 1

ఆల్బర్ట్ ఐన్ స్టీన్ మిలేవా అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అయితే, పెళ్లి చేసుకునే ముందే ఆమెకు కొన్ని విచిత్రమైన కండిషన్స్ పెట్టారట. అవి వింటే ఎవరైనా ముక్కున వేలేసుకోవాల్సిందే. ఐన్ స్టీన్ మొదటి భార్య పేరు మిలేవా. మిలేవా కు ఆల్బర్ట్ ఐన్ స్టీన్ ను పెళ్లి చేసుకోకముందే ఒక పాప ఉంది. కానీ, వివాహానికి ముందే ఆమె పాప ను వేరొకరికి దత్తత ఇచ్చేసింది. దీనితో, ఈ విషయం ఐన్ స్టీన్ కు తెలియదు. ఐన్ స్టీన్ పెట్టిన షరతులన్నిటిని ఒప్పుకుని మిలేవా ఐన్ స్టీన్ ను పెళ్లి చేసుకుంది.

ainstein with wife

ఐన్ స్టీన్ పెట్టిన షరతులేంటంటే..ఐన్ స్టీన్ కు చెందిన బట్టలను రోజు శుభ్రం గా ఉతికి ఆయన కప్ బోర్డు లోనే ఉంచాలి. ఆయన రోజు అందరితో పాటు కలిసి భోజనం చేయరు. రోజుకు మూడు సార్లు ఆయన గదికి భోజనాన్ని పంపించాల్సిందే. ఆయన బెడ్ రూమ్, స్టడీ రూమ్ ఎప్పుడు శుభ్రం గా ఉండాల్సిందే.

ఆయన డెస్క్ ను ఆయన కాకుండా మరొకరు ఉపయోగించడానికి వీలు లేదు. ఆయన భార్య అయినప్పటికీ ఐన్ స్టీన్ కోరకుండా ఆయనతో ఆ పని చేయడానికి ప్రయత్నించకూడదు. ఆయనను అడగకుండా ఆ పని చేయడానికి వీలు లేదు. ఆయనను ఆ పని చేసే విధం గా ప్రేరేపించకూడదు.

ainstein with wife img 2

ఇంట్లో ఉన్నా, బయటకు వెళ్లినా ఆయనతో కలిసి కూర్చోకూడదు. అలానే, పిల్లల ముందు ఆయనను తక్కువ చేసి మాట్లాడకూడదు, దుర్భాషలాడకూడదు. ఈ షరతులన్నిటిని ఒప్పుకున్న తరువాతే మిలేవా ఐన్ స్టీన్ ను పెళ్లి చేసుకుంది. ఇరవై సంవత్సరాల పాటు వీరు కలిసే ఉన్నారు. ఆ తరువాత విడిపోయారు.

వీరికి ఇద్దరు పిల్లలు సంతానం కూడా ఉన్నారు. మిలేవా ను వదిలేసిన తరువాత, ఐన్ స్టీన్ తన కజిన్ ఎల్సా లోవెన్ధాల్ తో కలిసి వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆ తరువాత వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఐన్ స్టీన్ మరణానంతరం థామస్ హార్వే అనే ఓ వైద్యుడు ఐన్ స్టీన్ మెదడు ని తీసి భద్రపరిచారు. ఈ మెదడుని ఎప్పటికైనా శోధించాలనేది చాలామంది శాస్త్రవేత్తల కల.


End of Article

You may also like