గుర్తుపట్టలేకుండా మారిపోయిన ఈ హీరో ఎవరో చెప్పుకోండి..!!

గుర్తుపట్టలేకుండా మారిపోయిన ఈ హీరో ఎవరో చెప్పుకోండి..!!

by Sunku Sravan

Ads

నందమూరి కళ్యాణ్ రామ్ ఇప్పటి వరకు చేసిన సినిమాలన్నింటిలో యాక్షన్, మరియు లవ్ స్టోరీ లు మాత్రమే ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. కానీ ప్రస్తుతం కళ్యాణ్ రామ్ సరికొత్త పిరియాడికల్ మూవీ ‘బింబిసారా’ లో న్యూ లుక్ లో కనిపించబోతున్నారు.

Video Advertisement

ఇప్పటికే ఈ సినిమా కోసం ఆయన తన శరీరాకృతిని పూర్తిగా మార్చుకున్నారు. కొత్త లుక్ లో నందమూరి అభిమానులందరిని అలరించ బోతున్నారు అని చెప్పవచ్చు.

ఇప్పటికే ఈ సినిమా టీజర్ రిలీజ్ అయ్యి సోషల్ మీడియాలో చాలా పాపులారిటీ పెంచుతుంది. అయితే ఈ సినిమా మొత్తం క్రీస్తుపూర్వం 5వ శతాబ్దానికి చెందిన బింబిసారుడు చరిత్ర గురించి ఉండబోతుంది అనే విషయాన్ని గమనించవచ్చు. మరి బింబిసార అంటే ఎవరు? ఆయన చరిత్రలో ఎలా నిలిచిపోయారు? అనేదానిపై ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

బింబిసారుడు అంటే ఎవరో చూద్దాం..! 5వ శతాబ్దంలో మగధ రాజ్యాన్ని పరిపాలించిన రాజు బింబిసారుడు. ఆయన హర్యాంక వంశానికి చెందిన రాజు. ఈయన బట్టియా అనే అధిపతికి జన్మించాడు. 15 సంవత్సరాల వయసులోనే సింహాసనం అధిష్టించిన వ్యక్తి. క్రీస్తుపూర్వం 543 నుండి 492 మధ్యకాలంలోనే మగధ సామ్రాజ్యాన్ని పరిపాలించాడు. ఈ బింబిసారుడు కోసల రాజుల్లో, మహా కోసల కూతురైన కొసలా దేవిని వివాహం చేసుకున్నాడు.

అయితే ఇందులోనే ఒక మంచి పాత్రలో కళ్యాణ్ రామ్ నటిస్తుండడంతో ఈ మూవీపై భారీగా అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ మూవీ తమ సొంత బ్యానర్ ఎన్టీఆర్ ఆర్ట్స్ లో తన బావ హరికృష్ణ నిర్మాతగా మూవీ నిర్మిస్తున్నారు. దీనికి భగీరథ, బన్నీ సినిమాలను ప్రొడ్యూస్ చేసినటువంటి నిర్మాత సత్య నారాయణ కొడుకు వశిష్టు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఇది కళ్యాణ్ రామ్ కు 18వ మూవీ. ఈ మూవీ కోసం దాదాపుగా 40 కోట్లు ఖర్చు పెడుతున్నారని సమాచారం. ఈ కథ మీద నమ్మకంతోనే అంత ఖర్చు పెడుతున్నట్లు సినీ వర్గాలు తెలియజేస్తున్నాయి.


End of Article

You may also like