“ఈ విజయం నీ ఒక్కడిదే కాదు… కొన్ని కోట్ల మందిది..!” అంటూ… “పవన్ కళ్యాణ్” అభిమాని ఎమోషనల్ లేఖ..! ఏం రాశారంటే..?

“ఈ విజయం నీ ఒక్కడిదే కాదు… కొన్ని కోట్ల మందిది..!” అంటూ… “పవన్ కళ్యాణ్” అభిమాని ఎమోషనల్ లేఖ..! ఏం రాశారంటే..?

by Harika

Ads

ప్రియమైన పవన్ అన్నకి,

Video Advertisement

నిన్ను అలా చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది అన్నా. ఈ ఒక్క క్షణం కోసం ఎన్ని సంవత్సరాల నుండి ఎదురు చూసాం. ఎంతో ఓపిక పట్టాం. చాలు. నిన్ను అలా చూస్తూ ఉంటే ఈ కష్టానికి ఫలితం లభించినందుకు చాలా ఆనందంగా ఉంది. నువ్వు బాధపడితే, నేను బాధపడే వాడిని. నువ్వు ఏడిస్తే, నేను ఏడ్చేవాడిని. నీకు కోపం వస్తే, నాకు కూడా కోపం వచ్చేది. నువ్వు ఆనందపడితే, నేను కూడా ఆనందపడే వాడిని. నువ్వు సినిమాలు వదిలేసి రాజకీయాల్లోకి వస్తున్నావు అంటే భయం వేసింది అన్నా. నువ్వు మాకు దగ్గర అయ్యిందే సినిమాల ద్వారా. అలాంటి నువ్వు సినిమాలు మానేస్తున్నాను అంటే జీర్ణించుకోలేకపోయాను.

pawan kalyan salary as mla

సాధారణంగా చాలా మంది సినిమా వాళ్ళు రాజకీయాల్లోకి వెళ్తారు. కానీ నువ్వు వెళ్తున్నావు అని అసలు అనుకోలేదు. కానీ నువ్వు ఏదైనా సరే ఆలోచించి నిర్ణయం తీసుకుంటావు. అందుకే, నీకు ఎలా మద్దతు ఇవ్వాలి అనే విషయమే ఆలోచించాను. అజ్ఞాతవాసి సినిమా పోయినప్పుడు చాలా బాధగా అనిపించింది అన్నా. సినిమా పోయినందుకు కాదు. దీని తర్వాత మళ్లీ నువ్వు సినిమాలు చేయవు అని తెలిసి చాలా బాధగా అనిపించింది. కానీ మళ్ళీ వకీల్ సాబ్ సినిమా చేసావు.. ఆ తర్వాత సినిమాలు చేస్తూ వస్తున్నావు. ఎన్ని చేస్తున్నా కూడా రాజకీయాల్లో నువ్వు ముందుకు వెళ్లట్లేదు అన్న అసంతృప్తి నీ ముఖంలో కనిపించేది.

నువ్వు అలా బాధపడుతూ ఉంటే, మాకు కూడా బాధగా అనిపించేది. ఎలాగైనా సరే ఈసారి నువ్వు గెలవాలి అని అనుకున్నాం. నేను మాత్రమే కాదు. నాలాగా ఎన్నో కోట్ల మంది నీ అభిమానులు ఇదే విషయం అనుకున్నారు. అందుకే ఇవాళ ఈ విజయం నీ ఒక్కడిది కాదు. నీతో పాటు ఈ కోట్ల మంది అభిమానులం కూడా గెలిచాం. నువ్వు ప్రమాణ స్వీకారం చేస్తుంటే కన్నీళ్లు ఆగలేదు. నువ్వు ఇలాగే ధైర్యంగా ముందుకు వెళ్లాలి అన్నా. నీ వెంట మేము ఉన్నాం. ఎప్పటికీ ఉంటాం.

ఇట్లు,
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గారి అభిమాని.


End of Article

You may also like