కొన్ని సినిమాలు విడుదల అయ్యి ఎన్ని సంవత్సరాలు అయినా సరే ప్రేక్షకులకి మాత్రం గుర్తుండిపోతాయి. ఈ జాబితాకు చెందిన సినిమా నువ్వొస్తానంటే నేనొద్దంటానా. ఈ సంవత్సరం జనవరికి నువ్వొస్తానంటే నేనొద్దంటానా విడుదలయ్యి 17 సంవత్సరాలు అయ్యింది. ఇప్పటికి కూడా ఈ సినిమా చాలా మందికి ఫేవరెట్ సినిమాగా ఉండే ఉంటుంది.

Video Advertisement

ప్రభుదేవా దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో సిద్ధార్థ్, త్రిష హీరో హీరోయిన్లుగా నటించారు. రియల్ స్టార్ శ్రీహరి గారు ముఖ్య పాత్ర పోషించారు. అంతే కాకుండా వేద, సునీల్, జయప్రకాష్ రెడ్డి, సంతోషి, అజయ్, నర్సింగ్ యాదవ్ ముఖ్య పాత్రలు పోషించారు. అమెరికా నుండి వచ్చిన ఒక అబ్బాయికి, ఒక పల్లెటూరి అమ్మాయికి మధ్య జరిగే ప్రేమ కథ ఈ సినిమా. ఈ సినిమాకి ప్రభుదేవా దర్శకత్వం వహించారు. కమర్షియల్ సినిమాల హవా నడుస్తున్న టైంలో లవ్ స్టోరీ అయిన నువ్వొస్తానంటే నేనొద్దంటానా వచ్చింది.

ప్రేక్షకులు కూడా ఈ సినిమాని ఎంతగానో ఆదరించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అయితే ఈ సినిమాకి ఒక మేజర్ ప్లస్ పాయింట్ గా నిలిచింది. ఈ సినిమా ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిందంటే, నువ్వొస్తానంటే నేనొద్దంటానాని తొమ్మిది భాషల్లో రీమేక్ చేశారు. అన్ని భాషల్లో రీమేక్ అయిన ఇండియన్ సినిమాగా రికార్డు సాధించింది నువ్వొస్తానంటే నేనొద్దంటానా. అయితే, ఈ సినిమాలో ఒక ఇద్దరు ప్రముఖ ఇంగ్లాండ్ క్రికెటర్లు గెస్ట్ అప్పియరెన్స్ లో కనిపించారు.

england cricketers cameo in nuvvostanante nenoddantana

వారెవరో కాదు. బెన్ స్టోక్స్ ఇంకా జోఫ్రా ఆర్చర్. వీరిద్దరూ చంద్రుళ్ళో ఉండే కుందేలు పాటలో సిద్ధార్థ్ తో కలిసి కనిపిస్తారు. కేవలం ఒక్క సీన్ లో మాత్రమే వీరు కనిపిస్తారు. ఒకసారి సిద్ధార్థ్ దీనిపై వచ్చిన ఒక మీమ్ ని కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు. మీమ్ ని షేర్ చేయడంతో పాటు, “ఇంటర్నెట్ ఇలాంటి వల్ల ఇలాంటి తెలియని చాలా విషయాలు కూడా తెలుస్తాయి” అని అర్థం వచ్చేలాగా కూడా రాసారు సిద్ధార్థ్.