తగ్గేదేలే అంటున్న టెన్త్ విద్యార్థి..ఆన్సర్ షీట్ లో పుష్ప..పుష్పరాజ్ అంటూ జవాబు..!!

తగ్గేదేలే అంటున్న టెన్త్ విద్యార్థి..ఆన్సర్ షీట్ లో పుష్ప..పుష్పరాజ్ అంటూ జవాబు..!!

by Sunku Sravan

Ads

పుష్ప ఫీవర్ జనాల్లో ఇంకా తగ్గలేదు. అందులో ఉండే తగ్గేదేలే.. పుష్ప.. పుష్పరాజ్ అనే డైలాగ్ లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. డైలాగులు సామాన్య ప్రజల నుంచి సెలబ్రిటీల వరకు ఒక వైరల్ ఫీవర్ లా మారింది. ఈ డైలాగ్ దేశవ్యాప్తంగా ఎంతో ఫేమస్ అయింది.

Video Advertisement

చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు పుష్ప రాజ్ డైలాగ్ పలుకుతూ అందరినీ మైమరిపించారు. ఈ తరుణంలో హిందీ వర్షన్ లో వచ్చిన డైలాగ్ కూడా ప్రస్తుతం బెంగాల్ పదవ తరగతి చదువుతున్న విద్యార్థికి తాకింది.

హిందీలో అల్లు అర్జున్ పుష్ప.. పుష్ప రాజ్.. మెయిన్ జుకేగా నహీ.. ( నేను పుష్ప రాజ్ ను.. నేను తలవంచను ) అంటూ ఒక డైలాగ్.. యువతను తెగ ఆకట్టుకుంటుంది. ఈ సినిమా వచ్చి ఇన్ని రోజులైనా పదవ తరగతి విద్యార్థి ఊహించని షాక్ ఇచ్చారు. ఇది ప్రస్తుతం వైరల్ గా మారింది. పుష్ప పుష్ప రాజ్.. జవాబులను రాసేదే లే.. అంటూ ఆ విద్యార్థి ఆన్సర్ షీట్ లో రాసింది అంతా వైరల్ గా మారింది. ప్రస్తుతం ఇది నెట్టింట్లో వైరల్ అవుతోంది. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని సెకండరీ స్కూల్ పరీక్షల్లో పదవ తరగతి విద్యార్థి సమాధాన పత్రంలో ఈ డైలాగ్ రాసుకోవడం చూస్తుంటే..

ఈ మూవీ విద్యార్థులను ఏ విధంగా ప్రభావితం చేసిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇటీవలే బెంగాల్ లో పదో తరగతి పరీక్షలు కూడా ముగిసాయి. ప్రస్తుతం జవాబు పత్రాల మూల్యాంకనం కూడా జరుగుతోంది. ఈ విద్యార్థి రాసిన జవాబు పత్రాన్ని మూల్యాంకనం చేసే టీచర్ చూసి షాక్ అయ్యారు.. పత్రం మధ్యలో పెద్ద పెద్ద అక్షరాలతో కూడిన పుష్ప పుష్ప రాజ్..అపును లికేగా నహి అని రాసి ఉండడం చూసి ఆ టీచర్ ఒక్కసారిగా అవాక్కయ్యారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. పుష్ప సినిమా ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద 300 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ మూవీపై ఓటిటి ప్లాట్ ఫారం లో కూడా సానుకూల స్పందన వచ్చింది


End of Article

You may also like