Ads
కరోనా వల్ల పాఠశాలలు మూతపడ్డాయి. దాంతో పాఠశాలల యాజమాన్యం ఆన్లైన్ తరగతులు మొదలుపెట్టారు. దీనివల్ల పాఠశాల వాతావరణం అంతా మిస్ అవుతున్నారు విద్యార్థులు. కానీ ఏదేమైనా అల్లరి మాత్రం స్కూల్ లో చేసిన విధంగానే ఉంది.
Video Advertisement
దానికి ఈ విద్యార్థి రాసిన హోంవర్క్ ఒక ఉదాహరణ.ఆన్లైన్ తరగతుల లో ఒక టీచర్ ఒక ప్రైమరీ స్కూల్ విద్యార్థికి కరోనా గురించి ఎస్సే రాయమని హోంవర్క్ ఇచ్చారు. దానికి ఆ విద్యార్థి ఈ విధంగా రాశాడు.
“కరోనా ఒక కొత్త పండుగ. ఈ పండుగ హోలీ తర్వాత వస్తుంది. ప్రజలు దీన్ని చాలా రోజులు జరుపుకుంటారు. ఈ పండగ అప్పుడు ఇంట్లో చాలా వంటలు వండుతారు. అందరూ ఇంట్లోనే ఉంటారు. కొన్ని నెలల పాటు పాఠశాలలు మూసేస్తారు. పరీక్షలు క్యాన్సిల్ చేసేస్తారు. దుకాణాలు, ఆఫీసులో కూడా మూసేస్తారు. అందరూ ఈ పండుగని దీపాలు వెలిగించి, గంటలు కొట్టి, ప్లేట్లను మోగిస్తూ జరుపుకుంటారు.
ఇంకా ఈ పండగకి మాస్కులు వేసుకుంటారు, నమస్తే చెబుతారు. ఈ పండగ అప్పుడు మా నాన్న బెర్ముడా, టీ షర్ట్ వేసుకుని, ఇల్లు తుడుస్తాడు. మా అమ్మ ఎక్కువ సమయం వంటలు చేస్తూ గడుపుతుంది. ఇంకా తన ఫోన్ లో యూట్యూబ్ ఛానల్ లో వంటల వీడియోలు చూస్తుంది” అని రాశాడు.తెలిసి తెలియక రాసిన ఆ విద్యార్థి హోం వర్క్ మనకే కాదు ఆ హోం వర్క్ ఇచ్చిన టీచర్ కి కూడా నవ్వు తెప్పించే ఉంటుంది.
End of Article