Ads
కొన్ని ప్రశ్నలు వినడానికి వింతగా ఉన్నా వాటి సమాధానాలు భవిష్యత్తులో మహా గమ్మతుగా ఉంటాయి.అవే రేపటి ప్రయోగాలకు నాంది అవుతాయి. ఏంటి నేను చెప్పేది నమ్మట్లేదా?అయితే ఈ సాక్ష్యాలను ఒకసారి చూడండి తర్వాత మీరే మీ అభిప్రాయాన్ని మార్చుకుంటారు.ఒకప్పుడు పక్షిని చూసిన రైట్ బ్రదర్స్ వాటిలా మనమెందుకు ఎగరలేమనే ప్రశ్న వారికి ఎదురవ్వడం వల్లే మనం ఈరోజు విమానాలలో తిరుగుతున్నాం.మన చిన్నప్పటి ఫెయిరీ టేల్స్ లో మంత్రగత్తెలు రింగ్స్ లో చూసే చిత్రాలను మనం చుడలేమా అనే ఎదురైన ప్రశ్న కారణంగానే టీవీ,హోం థియేటర్, ప్రొజెక్టర్ లు వంటివి పురుడు పోసుకున్నాయి.
Video Advertisement
తాజాగా ఇలాంటి ఓ ప్రశ్నే ఆస్ట్రేలియన్ నేషనల్ ఇనిస్టిట్యూట్ లోని డాక్టర్ బ్రాడ్ టకర్ కు వచ్చింది.ఇంతకీ ఆ ప్రశ్న ఏంటంటే అంతరిక్షం ఏ వాసన కలిగివుంటుంది?దీనికి సంబంధించి ఆయన ఓ రీసెర్చ్ చేశారు.అంతరిక్షంలో ఉండే ఎలెమెంట్స్ భూమి మీద కూడా ఉంటాయి.వాటి ఆధారంగా మరియు స్పేస్ స్టేషన్లు ఉన్నప్పుడు ఆస్ట్రోనాట్స్ డ్రెస్సులకు అటాచ్ అయ్యి ఉండే స్మెల్ ను ఎక్స్పీరియన్స్ చేసిన ఆస్ట్రోనాట్స్ ఇచ్చిన సమాచారం మేర స్పేస్ స్మెల్ అనేది కాలుతున్న మాంసం,మెటల్ వెల్డింగ్ చేస్తున్నప్పుడు వచ్చే వాసన కలిగి ఉంటుందని. తేల్చారు.
End of Article